KTR Kavitha HCA scam: భారత రాష్ట్ర సమితి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ఆర్థిక చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించింది. ఇందులో కొన్ని పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి. అయితే నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, కాలేశ్వరం వంటి వాటిల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రస్తుత ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఇందులో భాగంగా కొంతమంది అధికారులను అరెస్టు కూడా చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలను విచారిస్తోంది.. ఇవి జరుగుతుండగానే తెరపైకి మరో విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో తెలంగాణలో మరోసారి చర్చ మొదలైంది.
Also Read: తెలంగాణ జిల్లాల చుట్టూ ‘రింగ్ రైలు’.. గేమ్ చేంజర్ కాబోతోందా?
ఇటీవల ఐపీఎల్ జరిగినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై వరుస మెయిల్స్ చేసింది.. తమను టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు వేధిస్తున్నాడని.. విఐపి బాక్స్ లకు తాళం కూడా వేశాడని.. ఇవ్వాల్సిన టికెట్లు ఇచ్చామని.. అదనపు టికెట్ల కోసం ఆయన వేధిస్తున్నాడని అందులో పేర్కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించారు. ఈ విషయంలో లోతులను కనుకోవాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను ఆదేశించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ గాని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తలవంచింది.. అప్పటికప్పుడు ఈ వివాదం సమసిపోయినట్టు కనిపించినప్పటికీ.. విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంపై ఆధారాలు సంపాదిస్తూనే ఉంది. విచారణ కొనసాగిస్తూనే ఉంది. చివరికి జగన్మోహన్రావు కు వ్యతిరేకంగా అభియోగాలు మోపింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ పోలీసులు జగన్మోహన్రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఇది ఇలా సాగుతుండగానే తెరపైకి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: పొంగులేటి ఈడీ కేసు ఏమైంది.. 4 వేల కోట్ల కథ చెప్పిన కేటీఆర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమార్కులు పాగా వేయడం వెనక కేటీఆర్, ఆమె సోదరీ కల్వకుంట్ల కవిత హస్తము ఉందని తెలంగాణ సిఐడి కి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.. కల్వకుంట్ల కవిత, కల్వకుంట తారకరావు మాత్రమే కాకుండా జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్ ఫై కూడా క్లియర్ చేసింది. నాడు జగన్మోహన్రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలవడానికి వీరంతా తీర వెనుక పనిచేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. అంతేకాదు నాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్రావు తన విజయాన్ని కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, తన్నీరు హరీష్ రావు కు అంకితమిచ్చారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు గుర్తు చేస్తున్నారు..” జగన్మోహన్రావు గెలవడం కూడా అక్రమ పద్ధతుల్లోనే జరిగింది. సంతకాలను ఫోర్జరీ చేశారు. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారు. చివరికి యూనియన్ సొమ్మును దుర్వినియోగం చేశారు.. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన మీద చర్యలు తీసుకోలేదు. వాటికి సంబంధించి ఆధారాలు సమర్పిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని” తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు కోరుతున్నారు.