తిరుమలకు వచ్చే అన్యమతస్థుల డిక్లరేషన్‌పై రగడ సాగుతోంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏ మతస్థులైనా స్వామివారిని దర్శించుకోవచ్చని దానికి డిక్లరేషన్ సంతకం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామరాజు స్పందించారు. అన్యమతస్థులు తిరుమలకు వస్త్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. చివరకు ముఖ్యమంత్రి జగన్ స్వామివారిని దర్శించుకోవాలన్నా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. కాగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాను నల్ల రిబ్బన్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. కొంతకాలంగా వైసీపీతో విభేదాలు పెంచుకుంటున్న ఎంపీ తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఎటువంటి పరిణామాలు దారితీస్తాయోనని పార్టీలో చర్చించుకుంటున్నారు.