Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో మామిడి తోటలు దెబ్బతింటున్నాయ. వరి, మొక్కజొన్న పంటలకు నష్టం జరుగుతోంది. ఇక సోమవారం(మార్చి 18న) తెలంగాణలో వడగళ్ల వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ కబురు ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊటరనిచ్చింది. అయితే రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో..
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బీఆర్ వరకు జల్లులు పడుతున్నాయి. సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జగగిత్యాల జిల్లాల్లో వానలకు తోడు వడగళ్లు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
సోమవారం మోస్తరు వానలు..
ఇక సోమవారం (మార్చి 18న) తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉత్తర, వాయవ్యవ తెలంగాణలో జల్లులు కురుస్తాయి. ఉదయం 8:30 నుంచి రాత్రి 8 గంటల వరకు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రంతా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఉదయం జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వడగళ్లు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
ఐదు రోజులు వానలు..
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఈమేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.