MLC Kavitha: ఆ వీడియోలతో ఆటాడుకుంటున్నారు.. ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌ ఫ్యామిలీపై ట్రోల్స్‌!

క్కర్‌ లేకుండా చేస్తానని టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన కవిత, అదే దందా చేసి ఈడీకి దొరికిపోవడంపై సెటైర్లు పేలుతున్నాయి. కవిత సీఎం అయితే లిక్కర్‌ స్టేట్‌ చేస్తారు. లిక్కర్‌ వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Written By: Raj Shekar, Updated On : March 18, 2024 10:34 am

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీలోరి రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజల రిమాండ్‌ విధించింది. తర్వాత పది రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్‌ వేసింది. దీంతో ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కవిత అరెస్టు అక్రమమని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. అరెస్టును ఖండిస్తున్నాయి. మరోవైపు కవిత అరెస్టును విపక్షాలు సమర్థిస్తున్నాయి. హైదరాబాద్‌ భూకుంభకోణంలో కేటీఆర్‌ను, కాళేశ్వరం అక్రమాల కేసులో కేసీఆర్, హరీశ్‌రావు కూడా జైలుకు వెళ్తారని విపక్ష నేతలు పేర్కొంటున్నాయి.

కవిత వీడియో వైరల్‌..
ఇదిలా ఉండగా కవితకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోంది. ఆ వీడియో ఆధారంగా నెటిజన్లు కవితతోపాటు కేసీఆర్‌ ఫ్యామిలీని ట్రోల్‌ చేస్తున్నారు. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్తు కవితను మీరు సీఎం అయితే మొదట తీసుకునే నిర్ణయం ఏమిటని అడిగ్గా.. దానికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. తనకు సీఎంగా అవకాశం వస్తే తాను ఆల్కహాల్‌ లేకుండా చేస్తానని తెలిపారు. ఆల్కహాల్‌ లేకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుందని చెబుతారని, అయినా తాను మాత్రం నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

చెప్పేందుకే నీతులు…
లిక్కర్‌ లేకుండా చేస్తానని టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన కవిత, అదే దందా చేసి ఈడీకి దొరికిపోవడంపై సెటైర్లు పేలుతున్నాయి. కవిత సీఎం అయితే లిక్కర్‌ స్టేట్‌ చేస్తారు. లిక్కర్‌ వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో కవిత, కేటీఆర్, కేసీఆర్‌ ఏడుస్తున్న వీడియోను సృష్టించి తెలంగాణ యాసలో ట్రోల్‌ చేస్తున్నారు. అరెస్టు వ్యవహారంపై జరుగుతున్న ట్రోలింగ్‌ బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారింది.