TGPSC Group-3 : తెలంగాణలో గ్రూప్‌–3 షెడ్యూల్‌ విడుదల.. నవంబర్‌లో పరీక్షలు..

తెలంగాణలో టీజీపీఎస్సీ ఇటీవలే గ్రూప్‌–1 మెయిన్స్‌ సమర్థవంతంగా నిర్వహించింది. తాజాగా గ్రూప్‌–3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది.

Written By: Raj Shekar, Updated On : October 31, 2024 10:54 am

TGPSC Group-3

Follow us on

TGPSC Group-3 : తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ.. టీజీ పీఎస్సీగా మారిన తర్వాత సమర్థవంతంగా పనిచేస్తోంది. గతేడాది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌–1, 2, 3, 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే పరీక్షలు నిర్వహించడంలో టీఎస్‌పీఎస్సీ విఫలమైంది. ప్రధానంగా గ్రూప్‌–1, 2 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, తర్వాత పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం కావడంలో పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అనంతరం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళణ చేశారు. కొత్త చైర్మన్, సభ్యులను నియమించడంతోపాటు టీఎస్‌పీఎస్సీ పేరును టీజీ పీఎస్సీగా మార్చారు. ఈ క్రమంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ విజయవంతంగా నిర్వహించింది. ఇటీవలే గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు కూడా పూర్తి చేసింది. దీంతో ఇక టీజీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టింది. ఈమేరకు తాజా అప్‌డేట్‌ ఇచ్చింది.

రెండు రోజులు పరీక్షలు…
నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌–3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్‌ –2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటలలోపు, మధ్యాహ్నం 1:30 గంటలలోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలి. తర్వాత అనుమతించరు.

10 నుంచి హాల్‌ టిక్కెట్లు…
నవంబర్‌ 10 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సెలక్షన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్థుల తమ హాల్‌ టికెట్లను, ప్రశ్న పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదైనా కారణంతో పోగొట్టుకుంటే డూప్లికేట్‌ జారీ చేయడం జరగదని స్పష్టం చేసింది. తెలంగాణలో 1,380కిపైగా గ్రూప్‌–3 పోస్టులు ఉన్నాయి. ఇందుకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌–3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్‌ రాయడానికి రెండున్న గంటల సమయం ఉంటుంది. పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తెలుగు ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.