Bigg Boss Telugu 8: సంచాలక్ గా పృథ్వీ ఫెయిల్..బ్లూ టీం కి అన్యాయం..యష్మీ కోసమే అలా కావాలని చేశాడా?

బ్లూ టీం కి పృథ్వీ వార్నింగ్ ఇస్తూ 'తర్వాత వచ్చే లెవెల్ లో మీరు ఓడిపోయేందుకే నేను గేమ్ ఆడుతా..ఎలా గెలుస్తారో చూద్దాం' అని అంటాడు. యాపిల్స్ టాస్క్ లో పృథ్వీ మనసులో నేను చేసింది గుర్తుపెట్టుకొని రివెంజ్ తీర్చుకున్నాడని హరితేజ నిఖిల్ తో అంటుంది. అసలు జరిగింది ఏమిటంటే యాపిల్స్ టాస్క్ లో చెట్టు మీద వాళ్ళ టీమ్స్ కి సంబంధించిన రంగులతో యాపిల్స్ ఉంటాయి. ప్రతీ టీం నుండి తమ యాపిల్స్ ని కాపాడుకోవడం కోసం ఒకరు చెట్టు వద్ద నిల్చుకొని డిఫెండ్ చేస్తారు.

Written By: Vicky, Updated On : October 31, 2024 10:45 am

Bigg Boss Teugu 8(1)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఎంత ఫైర్ వాతావరణంలో జరిగాయో మనమంతా చూసాము. నిన్న మొన్నటి వరకు స్నేహితులు లాగా కలిసి ఆడిన కంటెస్టెంట్స్ ఇప్పుడు విడిపోయి ఆడుతూ గొడవలు పడుతున్నారు. ఇది చూసేందుకు అభిమానులకు కాస్త కష్టంగా ఉన్నపటికీ, గేమ్ లో అయితే మునుపెన్నడూ లేని మజా వచ్చింది. నిన్న సంచాలక్ గా హరి తేజ ,పృథ్వీ ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అసలు జరిగింది ఏమిటంటే వాటర్ టాస్క్ లో హరితేజ పృథ్వీ కి అన్యాయం చేసింది. ముందుగా నభీల్, పృథ్వీ పరిగెత్తుకుంటూ వస్తే, హరితేజ నభీల్, అవినాష్ వచ్చాడని తప్పుగా చెప్తుంది. దీని వల్ల తన టీం అన్యాయంగా ఓడిపోతుంది.

అప్పుడు బ్లూ టీం కి పృథ్వీ వార్నింగ్ ఇస్తూ ‘తర్వాత వచ్చే లెవెల్ లో మీరు ఓడిపోయేందుకే నేను గేమ్ ఆడుతా..ఎలా గెలుస్తారో చూద్దాం’ అని అంటాడు. యాపిల్స్ టాస్క్ లో పృథ్వీ మనసులో నేను చేసింది గుర్తుపెట్టుకొని రివెంజ్ తీర్చుకున్నాడని హరితేజ నిఖిల్ తో అంటుంది. అసలు జరిగింది ఏమిటంటే యాపిల్స్ టాస్క్ లో చెట్టు మీద వాళ్ళ టీమ్స్ కి సంబంధించిన రంగులతో యాపిల్స్ ఉంటాయి. ప్రతీ టీం నుండి తమ యాపిల్స్ ని కాపాడుకోవడం కోసం ఒకరు చెట్టు వద్ద నిల్చుకొని డిఫెండ్ చేస్తారు. అలా ఏ టీం కి సంబంధించిన యాపిల్స్ తక్కువగా కోయబడి ఉంటాయో, ఆ టీం గెలిచినట్టు. యష్మీ యాపిల్స్ ని కోయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే క్రిందపడి ఉన్న రెడ్ యాపిల్ ని చూసి లోపలకి కనిపించకుండా దాచుతుంది. ఈ విషయం యష్మీ ఒప్పుకున్న తర్వాత కూడా పృథ్వీ రెడ్ టీం గెలిచినట్టు ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఇదేమిటని నిఖిల్ నభీల్ ప్రశ్నించగా, నేను ఆమె దాచినది చూడలేదు, కేవలం నేను చూసిన దానికి మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చాను అని అంటాడు.

అప్పుడు నిఖిల్ ‘సరేలే..మాకు అర్థమైంది’ అని వెటకారం తో పృథ్వీ తో అంటాడు. మరి ఈ టాస్క్ లో పృథ్వీ సంచాలక్ గా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా?, కేవలం రివెంజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశాడా అనేది వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చెప్పాలి. కానీ పృథ్వీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఎవరికీ అనిపించలేదు. తప్పులు అందరూ సమానంగా చేసారు, కొమ్మ ని తుంచేయడం మీ స్ట్రాటజీ అయితే, యాపిల్ ని దాచడం ఆమె స్ట్రాటజీ. చెట్టు నుండి యాపిల్ ని కోసి దాచితే తప్పు అవుతుంది కానీ, క్రింద పడిన యాపిల్ ని దాచడంలో తప్పేమి ఉంది?, ఎవరు చూసినా అదే చేస్తారు కదా, మా యాపిల్ ని తీసుకొని వెళ్ళండి అని చెప్పరు కదా అని అంటాడు పృథ్వీ. అతను మాట్లాడిన మాటల్లో లాజిక్స్ ఉండడంతో హౌస్ లోపల నిఖిల్, నభీల్ ఒప్పుకోకపోయినా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు.