Khammam Government Teacher: భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో జరిగిన ఆగడాలు తట్టుకోలేక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనను అమల్లోకి తీసుకొస్తామని ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే తమ అడుగులు ఉంటాయని చెప్పుకుంది. కానీ క్షేత్రస్థాయిలో అలా లేదు. ఎమ్మెల్యేల అనుచరులు దందాలు చేస్తున్నారు. మంత్రుల అనుచరులు ఆగడాలకు పాల్పడుతున్నారు. భూముల నుంచి మొదలు పెడితే ఇసుక వరకు దేనినీ వదిలిపెట్టడం లేదు. ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఇవే విషయాలను ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి వెలుగులోకి తీసుకొస్తోంది. తన అనుకూలమైన సోషల్ మీడియా గ్రూపులలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాయడానికి వీల్లేని విధంగా బూతులు మాట్లాడాడు. క్రాకర్స్ షాప్ ఓపెన్ చేసిన వ్యక్తి మీద దూసుకుపోయాడు. అడ్డగోలుగా మాట్లాడాడు. ఆకు పోటీగా షాప్ పెడతావా అంటూ అతని మీద వీరంగం చేశాడు. ఆ వ్యక్తి పేరు లక్ష్మణ్.. నెలకొండపల్లి మండలం సుద్దేపల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇతడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు దగ్గర వ్యక్తి అని తెలుస్తోంది. పైగా మంత్రి పేరు చెప్పుకొని క్రాకర్స్ షాపు ఓపెన్ చేసిన వ్యక్తి మీద దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. “పాల్వంచ నుంచి వచ్చి ఖమ్మంలో షాప్ పెట్టావు. బతకాలని లేదా రా లం** కొడుకా అంటూ బూతులు తిట్టాడు. తనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండ ఉందని.. షాపు గనుక తొలగించకపోతే మనుషులను పంపించి చంపిస్తానని బెదిరించాడు. అంతటితోనే లక్ష్మణ్ ఆగలేదు. ఏసీపీకి ఫోన్ చేసి, బూతులు తిట్టాడు. షాప్ తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేయించాడు.
లక్ష్మణ్ వీరంగం మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఆ దృశ్యాలు మొత్తం మీడియాలో ప్రమముఖంగా ప్రసారమయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీధి రౌడీలాగా వ్యవహరించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ ఉపాధ్యాయుడి వ్యవహార శైలి పట్ల సర్వత్ర చర్చ జరిగిన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా లక్ష్మణ్ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం లక్ష్మణ్ తీరును తప్పుపడుతూ సస్పెండ్ చేసింది.
లక్ష్మణ్ గురించి లోతుగా విచారిస్తే అనేక విషయాలు బయటపడ్డాయి. అతడు మంత్రి అండతో డిప్యూటేషన్ మీద కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పైగా పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లకుండా.. బయట వ్యవహారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అతడు రకరకాల వ్యవహారాలలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. చివరికి క్రాకర్స్ వ్యాపారంలో కూడా ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యాపారి తక్కువ ధరకు క్రాకర్స్ అమ్ముతున్న నేపథ్యంలో.. లక్ష్మణ్ కు కోపం వచ్చిందని.. అందువల్లే షాప్ యజమాని మీద వీరంగం ప్రదర్శించాడని సమాచారం.
నాకు పోటీగా షాపు పెడతావా.. నిన్ను చంపేస్తా లం*కొడక అంటూ మంత్రి తుమ్మల అనుచరుడి వీరంగం
ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలతో రౌడీ అవతారమెత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ దాడికి దిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు… pic.twitter.com/7fqbDA1RQa
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2025