https://oktelugu.com/

Telangana : రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్.. సన్నబియ్యంతో పాటు ఆ సరుకులు కూడా..

కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలనుకునేవారి ఆశలుచిగురించాయి. అయితే అదే సమయంలో రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. కానీ ఎప్పటి నుంచి అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఉత్తమ్క కుమార్ రెడ్డి మట్లాడుతూ వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.మరోవైపు రేషన్ కార్డుపై బియ్యం మాత్రమే కాకుండా గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 23, 2024 / 10:51 AM IST

    Good News For ration card holders

    Follow us on

    Telangana :  రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు దొడ్డుబియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు. అయితే ఈ బియ్యం తీసుకొని చాలా మంది ఇతరులకు విక్రయిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు సైతం ప్రభుత్వ బియ్యంను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రేషన్ కార్డు పై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    తెలంగాణలో రేషన్ కార్డులపై రోజురోజుకు తీవ్ర చర్చ సాగుతోంది. గత పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు పొందలేని వారికి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అందిస్తామని కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలనుకునేవారి ఆశలుచిగురించాయి. అయితే అదే సమయంలో రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. కానీ ఎప్పటి నుంచి అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఉత్తమ్క కుమార్ రెడ్డి మట్లాడుతూ వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.మరోవైపు రేషన్ కార్డుపై బియ్యం మాత్రమే కాకుండా గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

    ప్రస్తుతం హైదరాబాద్ లోనే రేషన్ కార్డు ద్వారా గోధుమలు పంపిణీ చేస్తున్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయన్నారు. సన్న బియ్యం, గోధుమల పంపిణీ ద్వారా లబ్ధిదారులకు ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యాన్ని కొంత మంది ఇతరులకు అమ్మేవారు. కొన్ని ప్రాంతాల్లో డీలర్లు సైతం నేరుగా బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు అందకుండా పోతుంది. ఈ నష్ట నివారణ కోసం సన్నబియ్యం పంపిణీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే ఇక నుంచి రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని అన్నారు. పలు ప్రాంతాల్లో 1629 రేషన్ డీలర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

    ప్రస్తుతం తెలంగాణలో 2.83 కోట్ల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా లబ్ధి చేకూరనుందని భావిస్తోంది. ఇదిలా ఉండగా గ్యాస్ సబ్సిడీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రూ.500 లకే సిలిండర్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్యాస్ ధర ప్రస్తుతం రూ.875గా ఉంది. రూ.500 పోను మిగతా మొత్తం అకౌంట్లో జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ మొత్తం వెంటనే పడడం లేదు. కొందరికి సాంకేతిక సమస్యల వల్ల ఇప్పటికే ఈ సబ్సిడీ మొత్తం జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనే సబ్సిడీ మొత్తం పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సబ్సిడీ గ్యాస్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు.