CM Chandrababu: బెస్ట్‌ సీఎంల జాబితాలో చంద్రబాబు.. టాప్‌ 5లో.. తమిళనాడు సీఎంతో పోటీ..

దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, వారిపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఆధారంగా పలు సంస్థలు సీఎంలకు ర్యాంకులు ఇస్తుంటాయి. ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇస్తుంటాయి. తద్వారా మిగతావారు స్ఫూర్తి పొందాలని ఇలా చేస్తుంటాయి.

Written By: Raj Shekar, Updated On : August 23, 2024 10:47 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం ఆధారంగా కొన్ని సంస్థలు ఏటా సీఎంలకు ర్యాంకులు ఇస్తున్నాయి. గతంలోఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బెస్ట్‌ సీఎంలకు ఎక్కువగాఒడిశా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ మొదటి స్థానంలో ఉండేవారు. తర్వాత ఉత్తర భారత దేశానికి చెందిన వివిధ రాస్ట్రాల సీఎంలే టాప్‌ 5లో ఉండేవారు. కానీ, ఈసారి ప్రకటించిన ర్యాంకుల్లో దక్షిణ భారత దేశానికి చెందిన ఇద్దరు సీఎంలో టాప్‌ 5లో స్థానం సంపాదించుకున్నారు. ప్రమాణ స్వీకరారం చేసిన రెండు నెలలకే ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు బెస్ట్‌ సీఎంల జాబితాలో టాప్‌ 5లో స్థానం పంపాదించుకున్నారు. తాజా ర్యాంకుల్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. మరో దక్షిణ భారత సీఎం ఎంకే.స్టాలిన్‌తో సమాన ర్యాంకులో ఉన్నారు. సీఓటర్‌ సంస్థ తాజాగా ఈ సర్వే ఫలితాలు ప్రకటించింది. దీంతో టీడీపీ శ్రేణుల సోషల్‌ మీడియాలో ఈ ర్యాంకులను వైరల్‌ చేస్తున్నాయి. బరిలో ఇప్పుడే నిలిచారు బాబు గారు. త్వరలో ఒక్కో స్థానం దాటుకొంటూ దూసుకు వెళతారు అంటూ పోస్టులు పెడుతున్నారు.

టాప్‌ 5 ర్యాంకులు ఇలా..
ఇదిలా ఉంటే సీ ఓటర్‌ విడుదల చేసిన ర్యాంకులు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బెస్ట్‌ సీఎంల జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. ఇతనికి ఆ దేశంలో 33 శాత మంది ఓటు వేశారు. ఇక తర్వాత స్థానంలో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ నిలిచారు. ఈయనకు 14 శాతం మంది ఓట్లు వేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఆయనకు మచ్చలా మారింది. అయినా బెస్టు సీఎంల ర్యాంకులో టాప్‌ 2లో ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఫైర్‌బ్రాండ్‌.. బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ నిలిచారు. మమతకు 9 శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇక తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు 5 శాతం ఓట్లతో 5వ ర్యాంకును ఇద్దరు సీఎంలు పంచుకున్నారు.

గత అభివృద్ధే చంబ్రాబు బలం..
నారా చంద్రబాబునాయుడు ఇప్పటి వరకు నాలుగుసార్లు సీఎం పదవి చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వరుసగా రెండు టర్మ్‌లు సీఎంగా ఉన్నారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మళ్లీ సీఎం అయ్యారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది. ఐదే ఐదేళ్లు తిరిగే సరికి మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రజల మన్ననలు పొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, విభజిత ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు అనేక అభివృద్ధి పనులు చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ఇక విభజిత ఏపీలో రాజధాని అమరావతికి రూపకల్పన చేసింది కూడ చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన తాజాగా గెలిచిన రెండు నెలలకే దేశంలో బెస్ట్‌ సీఎంలలో ఆప్‌ 5లో స్థానం దక్కించుకున్నారు.