New Ration Cards: తెలంగాణలో 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు స్కూటీలు, విద్యా రుణాలు, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, వ్యవసాయ రుణాలు మాఫీ, పింఛన్ రూ.4 వేలకు పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలతోపాటు అనేక హామీలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీంతోపాటు మరో కొత్త తరహా కార్డు కూడా ఇవ్వబోతోంది.
ప్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు..
తెలంగాణలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల కోసం అక్టోబర్ మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అర్హులం అని భావించేవారంతా దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ఇంటింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందిండానికి వీలవుతుందని తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి దుర్గాబాయి దేశ్‌ముఖ్ లాంటి ఆస్పత్రులు, ఎన్జీవోల సహకారం తీసుకుంటామని వెల్లడించారు.
ఇవీ ఉపయోగాలు..
ఇక ఈ ఫ్యామిటీ డిజిటల్ హెల్త్ కార్డులతో ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే.. వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలు ఇందులో ఉంటాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా కార్డు స్కార్ చేయగానే వ్యక్తి ఆరోగ్య, అనారోగ్య వివరాలన్నీ తెలుస్తాయి. దీంతో వైద్యం చేయడం సులభం అవుతుంది. తెలంగాణలో చాలా మంది హెల్త చెకప్ చేయించుకోరు. అలా చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చవుతాయని భావిస్తారు. కానీ, ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ హెల్త్ కార్డులలో ఆరోగ్య పరీక్షలుచేసిన తర్వాతనే వివరాలు నమోదు చేస్తారు. తద్వారా అదనపు భారం లేకుండా ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం వైద్యులకు సులభం అవుతుంది. చికిత్స చేయడం ఈజీ అవుతుంది.
వెంటనే దరఖాస్తు చేసుకోండి..
ప్రత్యేక ప్రయోజనాల కారణంగానే ప్రభుత్వం ఈ కార్డులు జారీ చేస్తోంది. వీటికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు తెలియాలంటే అక్టోబర్ మొదటి వారంలో విడుదలయే గైడ్‌లైన్స్ తెలుసుకోవాలి. వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.