Homeబిజినెస్Vivo V70 Lite 5G Launch: సరికొత్త Display తో Vivo కొత్త ఫోన్..

Vivo V70 Lite 5G Launch: సరికొత్త Display తో Vivo కొత్త ఫోన్..

Vivo V70 Lite 5G Launch: Vivo కంపెనీ తన V 70 సిరీస్‌లో భాగంగా కొత్తగా Vivo V70 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా యూఏఈ (UAE) మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ గా ఫోన్ ఉండాలని అనుకునే వారితో పాటు అద్భుతమైన కెమెరా కావాలని కోరుకునే వారికి ఈ ఫోన్ స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Vivo V70 Lite 5G స్మార్ట్‌ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 7.59mm మందంతో 194 గ్రాముల బరువుతో వస్తుంది. ఇందులో 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటంతో పాటు 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఫోన్ పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 4nm ప్రాసెస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మెమరీ విషయానికి వస్తే.. ఇందులో 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అవసరమైతే వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో దీనిని పెంచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్ ఉండగా.. దానికి తోడుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ కూడా సాధ్యమవుతుంది.

ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని భారీ బ్యాటరీ. ఇందులో 6,500mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. ఇది ఎక్కువ కాలం మన్నికను అందిస్తుంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇంకా ఈ ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, వైఫై, బ్లూటూత్ 5.4, NFC వంటి ఆధునిక ఫీచర్లను కూడా ఇందులో చూడవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫోన్ యూఏఈ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,099 (భారత కరెన్సీలో సుమారు రూ. 28,500) గా ఉంది. అలాగే 256GB వేరియంట్ ధర AED 1,299 (సుమారు ₹33,700) గా నిర్ణయించారు. ఇది బ్లాక్ మరియు గోల్డ్ రంగులలో లభిస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ Vivo V70e పేరుతో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version