Peddi 4 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై అప్పుడే 4 రోజులు పూర్తి అయ్యింది. ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురయ్యేలా చేసింది. ఒక్క ఓవర్సీస్ తప్ప, అన్నీ ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి కాసుల కనకవర్షం కురిసింది. ముఖ్యంగా తెలుగు , రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రానికి ‘ఓజీ’, ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది. ఓజీ చిత్రానికి మొదటి వీకెండ్ లో 103 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రాగా, ‘దేవర చిత్రానికి 102 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే, ఈ చిత్రానికి 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పుష్ప 2, ‘కల్కి’ చిత్రాలు మాత్రమే , మొదటి ఆదివారం రోజున 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాయి , ఇప్పుడు ఆ జాబితాలోకి పెద్ది చిత్రం కూడా వచ్చి చేరింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చినంత వసూళ్లు ఓవర్సీస్ నుండి మాత్రం ఈ చిత్రానికి రావడం లేదు. అక్కడ నాల్గవ రోజున కేవలం 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వీకెండ్ (4 రోజులు) లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
హిందీ , ఓవర్సీస్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఆ కారణం చేత ఈ చిత్రం లాంగ్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటుతుంది కానీ, అంతకు మించి ఎక్కువ వసూళ్లు రావడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 4 వ రోజున 7 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి నైజాం నుండి 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 2వ వీకెండ్ లో ఈ చిత్రానికి కచ్చితంగా 50 కోట్ల షేర్ వసూళ్లను వస్తుందని , ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అవుతాయని అంటున్నారు.
