Rajamouli: ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ రికార్డు బ్రేకింగ్ వసూళ్ళు రాబడుతుంది. యూఎస్ లో దేవర వసూళ్లు $4 మిలియన్ కి చేరువయ్యాయి. వరల్డ్ వైడ్ దేవర ఫస్ట్ డే రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మినహాయిస్తే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దేవర నమోదు చేసింది.
హిందీలో సైతం చెప్పుకోదగ్గ రెస్పాన్స్ దక్కుతుంది. ఫస్ట్ డే హిందీ వెర్షన్ రూ. 7-10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం కలదంటున్నారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. కాగా ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైన రాజమౌళి కుటుంబ సమేతంగా దేవర చిత్రాన్ని అభిమానుల మధ్య వీక్షించాడు.
రాజమౌళి బాలానగర్ లో గల విమల్ థియేటర్ లో దేవర చూశారు. ఆ సమయంలో ఓ మహేష్ అభిమాని… రాజమౌళిని ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ ఇవ్వాలంటూ కోరాడు. కరువులో ఉన్నాం సర్, మహేష్ బాబు మూవీ అప్డేట్ ఏమిటో చెప్పండని వేడుకున్నాడు. దానికి రాజమౌళి ఏం మాట్లాడలేదు. ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారు. అతని వైపు చూసి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది
మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. కోవిడ్ సమయంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడగా… రాజమౌళి ఇంటికి పరిమితం అయ్యారు. ఓ మీడియా ఛానల్ ఆయన్ని ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేయగా… తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది మే-జూన్ నెలల్లో మహేష్ బాబు మూవీ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపించింది.
ఇంత వరకు రాజమౌళి కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అధికారిక ప్రకటన పోస్టర్ కూడా వదల్లేదు. మహేష్ బాబు మాత్రం మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్నారు. రాజమౌళి మూవీలో మహేష్ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుందనేది లేటెస్ట్ న్యూస్. మరి చూడాలి రాజమౌళి ఎప్పుడు ముహూర్తం పెట్టాడో..