HomeతెలంగాణTelangana Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? తెలంగాణ వాహనదారులకు ఇది గొప్ప న్యూస్‌!

Telangana Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? తెలంగాణ వాహనదారులకు ఇది గొప్ప న్యూస్‌!

Telangana Traffic Challan: మీ వాహనాలకు చలానాలు పెండింగ్‌లో ఉన్నాయా.. భారీగా ఉన్న చలాన్లు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు
ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు చలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్‌ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది.

రెండు కోట్లకుపైగా పెండింగ్‌..
నవంబర్‌ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్‌ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్‌కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి.

2022లో ఇలా..
గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు.

ఈసారి గతం కన్నా ఎక్కువ రాయితీ
ఈనెల 26 నుంచి కొత్త రాయితీలు అమలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ఫోర్‌ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ద్విచక్రవాహనాలపై 80 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ఇక భారీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version