హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరిన్ని సిటీ బస్సులు…?

గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సడలింపుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో కొంతమంది వ్యక్తిగతంగా వాహనాలను కొనుగోలు చేశారు. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆర్టీసీ సైతం 50 శాతం సిటీ బస్సులకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. Also Read: కేసీఆర్‌‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..! అయితే 50 శాతం […]

Written By: Navya, Updated On : January 22, 2021 5:32 pm
Follow us on

గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సడలింపుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో కొంతమంది వ్యక్తిగతంగా వాహనాలను కొనుగోలు చేశారు. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆర్టీసీ సైతం 50 శాతం సిటీ బస్సులకు మాత్రమే అనుమతులు ఇచ్చింది.

Also Read: కేసీఆర్‌‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..!

అయితే 50 శాతం సిటీబస్సుల వల్ల కొన్ని రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అయితే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 75 శాతానికి సిటీ బస్సులను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

సీఎం కేసీఆర్ అనుమతితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఓకే చెప్పారని అన్నార్. బిజీ రూట్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు. అయితే 75 శాతం సిటీ బస్సులు ప్రజలకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

హైదరాబాద్ లో పరిమిత సంఖ్యలో నడుస్తున్నప్పటికీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మాత్రం పూర్తిస్థాయిలో బస్సులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో 100 శాతం సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.