రాష్ట్రంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ.. తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న అతిపెద్ద లోక్ సభ స్థానంగా తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలుపొందాలనే ధీమాతో పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ.. ధర్మపరిరక్షణ పేరిట యాత్ర ప్రారంభించింది. ఇక బీజేపీ సైతం అదే దారిలో ప్రచారానికి సిద్ధం అవుతుండగా.. జనసేన మాత్రం బీజేపీతో పొత్తు వద్దనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాషాయంతో పొత్తు పెట్టకుకోకుండా.. సొంతంగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: అయోధ్య రామమందిరానికి పవన్ ఎంత విరాళం ఇచ్చాడంటే?
తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమేపోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అంతకుముందు పీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది.
Also Read: నిమ్మగడ్డతో ఫైట్.. సుప్రీంకోర్టులో జగన్ కు షాక్?
ఈ అంశంపై జనసేన అధినేత సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. పొత్తుకు వెళ్లినా.. తమకు ఒరిగింది ఏమీ లేదని పార్టీ నాయకులతో చర్చించినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు అనేది శాశ్వతం కాదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో పార్టీ ముఖ్య నేతలు సైతం పొత్తు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావద్దని అధినేతకు సూచించారు.
బీజేపీ సైతం ఇదే పంథాలో ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ.. ధర్మ పరిరక్షణ యాత్ర పేరిట ప్రచారం మొదలు పెట్టగా.. బీజేపీ సైతం అదే దారిలో హిందువుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ప్రచారానికి సిద్ధం అవుతోంది. తమ అవసరాలకు పార్టీలు మారే.. నాయకులు.. పొత్తులు పెట్టుకునే వాళ్లు.. తమకు అవసరం లేదని తెగేసి చెప్పేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్