https://oktelugu.com/

రూ.4వేలకే కరోనా వ్యాక్సిన్.. ఆఫర్లతో ఫేక్ వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఇప్పుడు ఫేక్ వ్యాక్సిన్ దడ మొదలైంది. కరోనా వ్యాక్సిన్ ను రూ.4వేలకే అమ్ముతున్నట్లు సైబర్ కేటుగాళ్లు.. ఒక నకిలీ వెబ్ సైట్ ను తయారు చేశారు. అచ్చం కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మాదిరిగానే ఉండేలా తయారు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర సర్కారు ఓ కీలక ప్రకటన సైతం చేసింది. Also Read: కరోనా అలర్ట్.. ఆ ప్రాంతంలో 192 మంది విద్యార్థులకు పాజిటివ్..? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్రంట్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 12, 2021 / 01:39 PM IST
    Follow us on


    ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఇప్పుడు ఫేక్ వ్యాక్సిన్ దడ మొదలైంది. కరోనా వ్యాక్సిన్ ను రూ.4వేలకే అమ్ముతున్నట్లు సైబర్ కేటుగాళ్లు.. ఒక నకిలీ వెబ్ సైట్ ను తయారు చేశారు. అచ్చం కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మాదిరిగానే ఉండేలా తయారు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర సర్కారు ఓ కీలక ప్రకటన సైతం చేసింది.

    Also Read: కరోనా అలర్ట్.. ఆ ప్రాంతంలో 192 మంది విద్యార్థులకు పాజిటివ్..?

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సినేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు కదా.. అదే వ్యాక్సిన్ ను దేశ ప్రజల కోసం బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తే తప్పేంటని ఓ సెక్షన్ ప్రజలు డిమాండ్ కూడా చేశారు. అయితే కేంద్రం మాత్రం ఇందుకు సరేమీరా అంది..

    Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి మరో షాక్.. ప్రాణాంతక ఇన్ఫెక్షన్..?

    కరోనా వ్యాక్సిన్ ను ప్రయవేటు మార్కెట్లోకి తీసుకురాబోమని, అలా కుదరదని మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో అనుసరిస్తున్న విధానాలను బట్టి వరుసగా వివిధ వర్గాలకు కూడా కరోనా టీకాలు వేస్తామని తెల్చేశారు. అయితే.. కోవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అక్రమార్కులు కూడా దీన్ని వదలడం లేదు.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలకు నేరుగా అమ్మాలని అనుకుంటోంది. అందుకోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారానే అమ్మకాలు జరపాలని అనుకుంది. రూ.4000 నుంచి రూ.6వేల వరకు కరోనా వ్యాక్సిన్ ను పొందేలా ధర నిర్ణయించింది. విదేశాలలో దీనిఖర్చు అంతకు పదింతలు ఉంటుంది. త్వరపడండి అంటూ.. ‘mohfw. Xyz’ అనే వెబ్ సైట్ ప్రకటన ప్రస్తుతం ఆన్ లైన్ లో హాట్ టాఫిక్ గా మారింది. అచ్చం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్ను పోలి ఉండేలా ఈ నకిలీ వెబ్ సైటు ను కేటుగాళ్లు రూపొందించారు. అయితే ఇది నకిలీదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది.