KTR: గత ప్రభుత్వం తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ విదేశీ సంస్థకు ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ.56 కోట్లు కేటాయించారు నాటి ముఖ్యమైన మంత్రిగా ఉన్న కె.తారకరామారావు. ఈ విషయమై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రాథమిక విచారణ జరిపిన ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు కేటాయించిన విషయం గుర్తించింది. దీంతో పూర్తి విచారణకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌క లేఖ రాసింది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై కేసు నమోదుకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. దీంతో ఏసీబీ డిసెంబర్ 20న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కేసు విచారణకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది.
తాజాగా విచారణ..
తాజాగా శుక్రవారం(డిసెంబర్ 27న) విచారణ సందర్భంగా ఏసీబీ కేటీఆర్ నాట్ అరెస్టు దేశాలు ఎత్తేయాలని కోరింది. అంతకుముందు కేటీఆర్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కోర్టు కేసును డిసెంబర్ 31కి వాయిదా వేసింది. కేటీఆర్ అరెస్టు ఆదేశాలను మరో రోజు పొడిగించింది. విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. అయితే కేసు విచారణ దశలో కేటీఆర్‌కు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తెలిపింది. అందుకే అరెస్టు చేయవద్దనే ఆదేశాలు ఎత్తేయాలని కోరింది. అయితే తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి(డిసెంబర్ 31కి) వాయిదా వేయడంతో కేటీఆర్‌కు ఊరట లభించినట్లయింది.