HomeతెలంగాణShakeel Son Arrested: మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్‌ : బీఆర్ఎస్ హయాంలో ఎస్కేప్.. కాంగ్రెస్...

Shakeel Son Arrested: మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్‌ : బీఆర్ఎస్ హయాంలో ఎస్కేప్.. కాంగ్రెస్ సర్కార్ వదల్లేదు!

Shakeel Son Arrested: నాలుగు నెలల క్రితం సంచలనం సృష్టించిన ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహీల్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి దుబాయ్‌ పారిపోయిన రహీల్‌ నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు. సోమవారం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్‌ చేశారు. ప్రజాభవన్‌ దగ్గర బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో రహీల్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు..
రహీల్‌పై పోలీసులు ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అతడిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌ 24న పంజాగుట్ట హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రహీల్‌ అమిర్‌ దుబాయ్‌ పారిపోయాడు. దీని తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. రహీల్‌ను దేశం దాటించేందుకు పోలీసులు, అధికారులు సాయం అందించినట్లు తేలింది. దీంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న పంజాగుట్ట, బోధన్‌ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఆ రోజు ఏం జరిగింది?
గత డిసెంబర్‌ 24న యాక్సిడెంట్‌ తర్వాత సోహైల్‌ను పంజాగుట్ట ఠాణాకు కానిస్టేబుళ్లు తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పోలీస్‌ స్టేషన్ కు చేరుకున్నారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కానీ ఠాణాలో ఏం మంత్రాంగం జరిగిందో తెలియదు కానీ సోహైల్‌ బదులు షకీల్‌ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్‌ కట్‌చేస్తే ఎమ్మెల్యే కుమారుడు దుబాయ్‌ పారిపోయాడు. ఈ వ్యవహారంలో సీఐ, నైట్‌ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు తేల్చిన అధికారులు వారిని అరెస్టు చేశారు.

లుకౌట్‌ నోటీసులు కొట్టేయాలని కోర్టుకు..
ఇదిలా ఉంటే షకీల్‌ కొడుకు రహీల్‌ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై ఉన్న లుకౌట్‌ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్‌ వేశాడు. ప్రమాదం తర్వాత దుబాయ్‌ పారిపోయిన రహీల్‌ నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్‌ తండ్రి షకీల్‌ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్‌లోకి వచ్చిన రహీల్‌ తనపై ఉన్న లుకౌట్‌ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్‌ వేశాడు. పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

ఏప్రిల్‌ 22 వరకు రిమాండ్‌
ఎయిర్‌ పోర్టులో అదుపులోకి తీసుకన్న పోలీసులు రహీల్‌ను కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతనికి ఏప్రిల్‌ 22 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version