Pothina Mahesh: జనసేనకు కీలక నేత గుడ్ బై.. కారణం అదే

వాస్తవానికి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును మూడు పార్టీలు ఆశించాయి. దీంతో కొద్ది రోజులు పాటు ఈ నియోజకవర్గాన్ని అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి నేతలు ఆశించారు.

Written By: Dharma, Updated On : April 8, 2024 12:35 pm

Pothina Mahesh

Follow us on

Pothina Mahesh: కూటమిలో టిక్కెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొన్ని నియోజకవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. కొందరు పక్క పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జనసేన కీలక నేత పోతిన మహేష్ పవన్ కు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ కీలక నేత సుజనా చౌదరికి బిజెపి టికెట్ కేటాయించింది. అయితే టికెట్ పై ఆశలు పెట్టుకొని.. గత కొద్దిరోజులుగా యాక్టివ్ గా పని చేస్తున్న పోతిన మహేష్ అసంతృప్తికి గురయ్యారు. తన ఆవేదనను నేరుగా పవన్ కళ్యాణ్ కు వివరించారు. అయినా సరే టిక్కెట్టు విషయంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ పదవులతో పాటు సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.

వాస్తవానికి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును మూడు పార్టీలు ఆశించాయి. దీంతో కొద్ది రోజులు పాటు ఈ నియోజకవర్గాన్ని అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి నేతలు ఆశించారు. జనసేన నుంచి పోతిన మహేష్ బలంగా ప్రయత్నించారు. కానీ ఈ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. అయితే ఇక్కడ బిజెపి బలం అంతంత మాత్రమే. దీంతో ఈ సీటును తనకే ఇవ్వాలని పోతిన మహేష్ పవన్ ను కోరారు. అయితే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరిగిందని.. అర్థం చేసుకోవాలని.. ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో పవన్ హామీ ఇవ్వడంతోనే పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఇప్పుడు పవన్ చేతులెత్తేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

వాస్తవానికి గత ఐదు సంవత్సరాలుగా పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం లో గట్టిగానే పోరాడుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఢీకొట్టడంలో ముందంజలో ఉండేవారు. ఇక్కడ తనకు కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ లేదని పోతిన మహేష్ హెచ్చరిస్తూ వచ్చారు. గత కొద్దిరోజులుగా పార్టీపై అసంతృప్తి గళం వినిపిస్తూ వచ్చారు. అయితే హై కమాండ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా అధికం. అందుకే జగన్ తెలివిగా వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడ ఒక ముస్లిం అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో బిజెపికి ఈ సీటు ఇవ్వడం సాహసమే. ముస్లింలు బిజెపిని వ్యతిరేకిస్తారు. ఆపై ముస్లిం నేత వైసిపి అభ్యర్థి కావడంతో.. సుజనా చౌదరి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నియోజకవర్గంలో పట్టున్న పోతిన మహేష్ జనసేనను వీడడం కూటమికి చాలా లోటు. ఒకవేళ మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే.. కూటమి గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ తరుణంలో సుజనా చౌదరి ఎలాంటి చొరవ చూపుతారో.. మహేష్ ను జనసేన నుంచి బయటకు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూడాలి.