https://oktelugu.com/

Malla Reddy: మాజీ మంత్రితో సిఎం చెడుగుడు..! వేగలేక ఆపసోపాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన అమాత్యులలో ఫస్ట్ టార్గెట్ చేసింది చామకూర మల్లారెడ్డినే. దుండిగల్ పరిధిలోని చిన్నదామర చెర్వును మల్లారెడ్డి,ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసి అక్రమంగా కళాశాలను నిర్మించారని అధికారులు తేల్చడం సంచలనమైంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 19, 2024 / 02:17 PM IST

    Malla Reddy

    Follow us on

    Malla Reddy: బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవుతాయంటే ఇదే కావచ్చునేమో..! ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఆ పార్టీ అధినేత కేసిఆర్ అండతో గ్రేటర్ పరిధిలో..మాజీ మంత్రి మల్లారెడ్డి ఏ స్థాయిలో చెలరేగిపోయారో తెలిసింది. గ్రేటర్ లిమిట్స్ లో అప్పట్లో ఆయన ఆడింది ఆట..! పాడింది పాట అన్నట్లు ఈ మాజీ అమాత్యులు తన ప్రభావాన్ని చూపించగలిగల్గారు. కానీ,ఇదంతా నిన్న మొన్నటి వరకు జరిగిన తంతు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో..ఆ మాజీ మంత్రైన మల్లారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ సర్కార్ తొక్కుడు బిల్ల ఆడుకుంటుంది.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన అమాత్యులలో ఫస్ట్ టార్గెట్ చేసింది చామకూర మల్లారెడ్డినే. దుండిగల్ పరిధిలోని చిన్నదామర చెర్వును మల్లారెడ్డి,ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసి అక్రమంగా కళాశాలను నిర్మించారని అధికారులు తేల్చడం సంచలనమైంది. అందులో భాగంగానే మర్రిలక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి సంస్థకు సంబంధించిన 2 భవనాలు,6 షెడ్లను కొన్నాళ్ల క్రితం అధికారులు కూల్చివేశారు.
    అంతేకాక మల్కాజ్ గిరి,మేడ్చల్ శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో పలు చెరువుల శిఖం,ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ లాండ్స్ ను కబ్జా పెట్టినట్లు మునిసిపల్,ఇరిగేషన్ అధికారులు తేల్చారు.

    ఇక మరోవైపు మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన కళాశాలల్లో అధిక ఫీజుల వసూలుపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఏకంగా మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగడం మల్లారెడ్డి కి పెద్ద తలపోటుగా మారింది. ఈ యవ్వారం నుంచి ఆయన బయటపడేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో అప్పట్లో కాళ్ల బేరానికి కూడా ఆయన వెనకాడ లేదని చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి సీఎం రేవంత్ కు సన్నిహితులైన వేం నరేందర్ రెడ్డిని కలిసి తమ కాలేజీల కూల్చివేతలను ఆపాలని వేడుకున్నారు. అయితే ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల రావడం..రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవడంతో మల్లారెడ్డిపై నజర్ తగ్గించినట్లయితే.

    అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా మల్లారెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. ఎలక్షన్స్ ను పురస్కరించుకొని కాంగ్రెస్ పై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో నిద్రపోతున్న సింహాన్ని మళ్లీ లేపి తన్నించుకున్నట్లైంది మల్లారెడ్డి పరిస్థితి. అప్పటి వరకు కాస్తా సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన కబ్జాలపై మరోసారి దృష్టి సారించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందులో భాగంగానే సుచిత్రలోని సర్వేనెంబర్ 82లో మల్లారెడ్డికి సంబంధించిన భూమి విషయంలో అవతల పార్టీకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అండదండలతోనే మల్లారెడ్డికి ఈ ల్యాండ్ విషయంలో ఎదురు దెబ్బ తగిలినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతుంది. మొత్తానికి బిఆర్ఎస్ సర్కార్లో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ.. తొడగొట్టిన పాపమో..! ఏమో కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను ఇప్పుడు చెడుగుడు ఆడుకుంటున్నట్లే కనిపిస్తోంది.