https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో మళ్ళీ అదే క్రింజ్ కామెడీ ఉంటుందా..?

రీసెంట్ గా బాలయ్య బాబు తో ఆయన చేసిన భగవంత్ కేసరి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అనిల్ రావిపూడి కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 19, 2024 / 02:11 PM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తీస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా రవితేజ, మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లను కూడా అందుకున్నాడు.

    ఇక రీసెంట్ గా బాలయ్య బాబు తో ఆయన చేసిన భగవంత్ కేసరి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అనిల్ రావిపూడి కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. అయితే అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అని అందరూ చెబుతున్నప్పటికీ ఆయన సినిమాల్లో మాత్రం క్రింజ్ కామెడీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జెన్యూన్ కామెడీ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ప్రేక్షకుడు సినిమాలో వచ్చే ఆ కామెడీకి నవ్వలా, వద్దా అనే డైలమాలో ఉండిపోతాడు. మొదట్లో ఈయనని జంధ్యాల కి వారసుడిగా అభివర్ణించినప్పటికీ ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా క్రింజ్ కామెడీ నేపథ్యంలో సాగుతున్నాయి.

    ఇక దాని వల్ల ఆయన సినిమాలని జంధ్యాల సినిమాలతో పోల్చి చూడలేము అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అయితే మొదట్లో పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో కొంత వరకు ఆయన చేసిన కామెడీ బాగున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అసలు జబర్దస్త్ లో వచ్చే కామెడీ కంటే కూడా ఆయన రాసుకునే సీన్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే వెంకటేష్ తో చేయబోయే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే అనిల్ రావిపూడి వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 అనే రెండు సినిమాలు చేశాడు. అవి మంచి విజయాలను సాధించాయి. ఈ సినిమా తో మరొక విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎఫ్ 2, ఎఫ్ 3 లా మాదిరిగానే క్రింజ్ కామెడీ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించే అవకాశాలైతే లేవు అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు…