James Bond operation: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి లేకుంటే.. పోలీసులను వారి పని వారిని చేసుకొనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని.. అసాంఘిక శక్తుల ఆటలు సాగవని.. సంఘవిద్రోహశక్తుల దుర్మార్గాలు ముందుకెళ్లవని.. అలాంటి పనిని తెలంగాణ పోలీసులు చేసి చూపించారు. యావత్తు దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేశారు.
నేటి స్మార్ట్ కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దుర్మార్గులు రకరకాల విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు.. మెసేజ్లు పంపించడం.. లింకులు సెండ్ చేయడం.. డిజిటల్ అరెస్టులు.. మాదక ద్రవ్యాలు దొరికాయని చెప్పడం.. ఇలా రకరకాల విధానాల్లో మోసాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.. ఇలా అమాయకులను మోసం చేస్తే కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. పైగా ఈ డబ్బులను రకరకాల విధానాలలో మార్చేస్తూ తమ వద్దకు తెచ్చుకుంటున్నారు. ఇలా దొంగిలించిన డబ్బులను మ్యూల్ ఖాతాల సహాయంతో తమ వద్దకు తెచ్చుకుంటున్నారు.. అయితే ఈ తరహా మోసాలు ఇటీవల అధికంగా పెరగడంతో తెలంగాణ సైబర్ పోలీసులు దృష్టి సారించారు. అంతే కాదు సరికొత్త ఆపరేషన్ చేసి యావత్ దేశం మొత్తం తమ వైపు చూసేలా చేశారు.
తెలంగాణ పోలీసులకు ఇటీవల కాలంలో సైబర్ ఫిర్యాదులు పెరిగిపోయాయి. తెలంగాణ సైబర్ పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.. అయితే ఈ తీగను తెలంగాణలో లాగితే ఐదు రాష్ట్రాల్లో డొంక కదిలింది.. 95 కోట్ల స్కాం బయటపడింది.. అంతేకాదు 81 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. తెలంగాణలో వచ్చిన సైబర్ మోసంపై పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు.. మోసానికి పాల్పడిన వ్యక్తులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ముఠాలుగా ఏర్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు 81 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 754 కేసులు ఉన్నాయి. 95 కోట్ల విలువైన మోసాలకు వీరు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి 84 ఫోన్లు, 101 సిమ్ లు, 89 బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వారి ఖాతాలో ఉన్న కోట్ల నదులు మొత్తం ఫ్రీజ్ చేశారు.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్లలో ఇది అతి పెద్దదని తెలుస్తోంది.