Sleeping position: ఈ భూమి మీద ఏ జంతువు కైనా సరే విశ్రాంతి అనేది అవసరం. అందుకోసం నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోతే సకల రోగాలు పోతాయి. వాస్తవానికి ఎంత సుఖంగా పడుకుంటే శరీరం అంత బాగుంటుంది. కోతి నుంచి మొదలు పెడితే మనిషి వరకు ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. కాకపోతే జంతువులు ఒకే విధంగా పడుకొని ఉంటాయి. అందువల్లే వాటికి వెన్నెముక సమస్యలు రావు. పైగా అవి తీసుకునే ఆహారంలో ఇటువంటి హానికారక పదార్థాలు ఉండవు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.
వాస్తవానికి ఈ భూమ్మీద ఏ జంతువైనా సరే విశ్రాంతి తీసుకోవాల్సిందే. శరీరానికి విశ్రాంతి ఇచ్చినప్పుడే అది మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయగలుగుతుంది. అలా కాకుండా సరైన స్థాయిలో విశ్రాంతి ఇవ్వకపోతే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆ తర్వాత అనేక రకాల సమస్యలు వెలుగు చూస్తాయి. అందువల్లే సాధ్యమైనంతవరకు శరీరం విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యవంతుడైన మనిషి ఆరు నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అయితే నిద్రపోవడం అంటే ఇష్టం వచ్చిన భంగిమల్లో పడుకోవడం కాదు. నిద్ర అనేది ఒక ఆర్ట్.. అందులోనూ శరీరాన్ని వైద్యులు చెప్పినట్టుగా భంగిమలలో నిద్రపుచ్చడం అనేది మహా ఆర్ట్. ఎలాంటి భంగిమలలో పడుకోవాలి.. ఎలాంటి భంగిమలలో పడుకుంటే శరీరం హాయిగా ఉంటుందో వైద్యులు వివరిస్తున్నారు.
Also Read: వీటిని తింటే కిడ్నీ, లివర్ సమస్యలు దరి చేరవు..
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మనం కునుకు తీసే సమయంలో భంగిమ అనేది చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ముడుచుకొని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బోర్లా పడుకుంటే మెడపై కండరాలు, నడుముపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. మోకాలు ముడుచుకొని ఒక వైపునకు పడుకుంటే దీర్ఘకాలికమైన వెన్నునొప్పులు వస్తాయని చెబుతున్నారు. వెల్లకిలా లేదా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే ఈ సమస్యలు ఏవీ రావని.. శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.