https://oktelugu.com/

ఇక నుంచి ఇంటి అడ్రస్‌ కనుక్కోవడం ఈజీ..: ఎలానో తెలుసా!

సాధారణంగా ఎవరిదైనా అడ్రస్‌ తెలుసుకోవాలంటే.. ఫలానా ఊరు.. ఫలానా వీధి.. ఫలానా డోర్‌‌ నంబర్‌‌.. ఫలానా ఇంటి నంబర్‌‌.. పిన్‌కోడ్‌ వగైరా చెబుతుంటాం. దాని ద్వారా అడ్రస్‌ తెలుసుకొని అక్కడికి రీచ్‌ అవుతూ ఉంటాం. కానీ.. తెలంగాణలో ఇక నుంచి అలాంటి కష్టాలేమీ ఉండవట. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని మున్సిపాల్టీల్లో ఇంటి అడ్రస్‌లు డిజిటల్ రూపంలోకి మారబోతున్నాయి. Also Read: సాగర్‌‌ ఎన్నికలో ఆ లీడర్లు కలిసొచ్చేనా..! ఇకపై మీ ఇంటికి ఎలా చేరుకోవాలని ఎవరైనా […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 18, 2021 / 01:40 PM IST
    Follow us on


    సాధారణంగా ఎవరిదైనా అడ్రస్‌ తెలుసుకోవాలంటే.. ఫలానా ఊరు.. ఫలానా వీధి.. ఫలానా డోర్‌‌ నంబర్‌‌.. ఫలానా ఇంటి నంబర్‌‌.. పిన్‌కోడ్‌ వగైరా చెబుతుంటాం. దాని ద్వారా అడ్రస్‌ తెలుసుకొని అక్కడికి రీచ్‌ అవుతూ ఉంటాం. కానీ.. తెలంగాణలో ఇక నుంచి అలాంటి కష్టాలేమీ ఉండవట. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని మున్సిపాల్టీల్లో ఇంటి అడ్రస్‌లు డిజిటల్ రూపంలోకి మారబోతున్నాయి.

    Also Read: సాగర్‌‌ ఎన్నికలో ఆ లీడర్లు కలిసొచ్చేనా..!

    ఇకపై మీ ఇంటికి ఎలా చేరుకోవాలని ఎవరైనా అడిగితే.. మెసేజ్‌ చేయడం.. లొకేషన్‌ పంపించడం కాదు.. కేవలం క్యూఆర్‌‌ కోడ్‌ ఫార్వార్డ్‌ చేస్తే చాలట. రావాల్సిన వారు నేరుగా ఇంటిముందే ల్యాండయిపోతారు. గూగుల్ లొకేషన్ షేర్ చేసినట్టు, క్యూఆర్ కోడ్ షేర్ చేస్తే దాని ఆధారంగా నేరుగా ఇంటికే వచ్చేయొచ్చు. దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన క్యూఆర్ కోడ్ డిజిటల్ ఇంటి నెంబర్ల విధానాన్ని హైదరాబాద్‌లో కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఏపీలో చంద్రబాబు హయాంలో ఇలాంటి డిజిటల్ ఇంటి నెంబర్ల విధానాన్ని తీసుకొచ్చినా అది అట్టర్ ఫ్లాప్ అయింది.

    Also Read: అసలు దొంగలను వదిలి.. మిగితా వారిని విచారిస్తే ఏం లాభం

    డిజిటల్ ఇంటి నెంబర్లతోపాటు.. అడ్రస్‌ను కూడా పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయబోతున్నారు. క్యూఆర్ కోడ్‌లో ఎంటర్‌‌ చేస్తామని చెబుతున్నారు. ముందుగా చిన్న చిన్న పట్టణాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు. ఆ తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని చెబుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇప్పటివరకు కేవలం నగదు లావాదేవీలకే ఈ క్యూఆర్‌‌ కోడ్‌లను వినియోగించారు. కానీ.. ఇప్పుడు సమాచార మార్పిడికి కూడా బాగా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఇంటి అడ్రస్‌లు ఇప్పుడు క్యూఆర్ కోడ్ రూపంలోనే ఉంటున్నాయి. మనదేశంలో కూడా కొన్ని ప్రధాన నగరాల్లో ఈ విధానం అమలులో ఉన్నా.. పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన లేదు. ఎక్కువగా గూగుల్ లొకేషన్ షేర్ విధానంతోనే పని పూర్తి చేస్తున్నారు. ఇకపై క్యూఆర్ కోడ్ రూపంలో ఇస్తే సరి.