ఆ ఓటు బ్యాంక్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అడిగి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ.. పవన్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది. అది ఎలానో తెలుసా..! ఏకంగా జనసేనకు అంతోఇంతో ఓటు బ్యాంకు ఉన్న ఏరియాలను టార్గెట్‌ చేసింది. ఆయనకు ఓటు బ్యాంక్‌గా ఉంటున్న వారిని ఆకర్షించడానికి ప్రత్యేకంగా మిషన్ ప్రారంభించడం. పవన్ కల్యాణ్‌కు కామన్‌గా కాపు ఓటు బ్యాంక్ ప్రధాన బలం. కాపు యువత ఆయన వైపే ఉన్నారు. ఆయనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయంటే […]

Written By: Srinivas, Updated On : January 18, 2021 2:28 pm
Follow us on


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అడిగి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ.. పవన్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది. అది ఎలానో తెలుసా..! ఏకంగా జనసేనకు అంతోఇంతో ఓటు బ్యాంకు ఉన్న ఏరియాలను టార్గెట్‌ చేసింది. ఆయనకు ఓటు బ్యాంక్‌గా ఉంటున్న వారిని ఆకర్షించడానికి ప్రత్యేకంగా మిషన్ ప్రారంభించడం. పవన్ కల్యాణ్‌కు కామన్‌గా కాపు ఓటు బ్యాంక్ ప్రధాన బలం. కాపు యువత ఆయన వైపే ఉన్నారు. ఆయనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయంటే అదీ కూడా కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే. ఇప్పుడు బీజేపీ కాపు ఓటు బ్యాంక్‌ను తమ పార్టీ వైపు మళ్లించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: బీజేపీలో చిన్నమ్మకు పెరిగిన గౌరవం

సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి.. ఓ వర్గాన్ని పార్టీ నుంచి పంపేసి కాపు వర్గాన్ని దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమైన కాపు నేతల్ని పార్టీలోకి ఆహ్వానించడానికి చూస్తున్నారు. ముఖ్యంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన సోము వీర్రాజు.. పార్టీలోకి ఆహ్వానించడం మాత్రమే మొత్తం కాపు సమాజాన్ని గతంలో రెచ్చగొట్టినట్లుగా చేసి బీజేపీ వైపు మళ్లించాలనే పెద్ద టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: ఆ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు కదా

అయితే.. ఈ విషయాన్ని పరోక్షంగా సోము వీర్రాజు చెప్పుకొచ్చారు కూడా. ముద్రగడకు పెద్ద బాధ్యతే ఇచ్చామని ఆలోచించుకుని చెబుతామన్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. మరికొంత మంది కాపు నేతలపై గురి పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాపులను తమవైపు వైపునకు తిప్పుకుంటే.. ఇక పవన్‌తో బీజేపీకి అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో దగ్గరగా.. దూరంగా అన్నట్లుగా ఉంటున్నారు. తన కార్యక్రమాలు తాను చేస్తూ పోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వర్గాన్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకోకపోతే.. బీజేపీకి మనుగడ కష్టం. అందుకే పవన్‌ను ఈజీగా డీల్ చేసి ఆయన ఓటు బ్యాంక్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం అన్నట్లుగా బీజేపీ జనసేనల పరిస్థితి మారింది.