బీజేపీలో చిన్నమ్మకు పెరిగిన గౌరవం

ఎన్టీఆర్‌‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్‌‌ తనయ పురంధేశ్వరి. ఏనాడూ ఆమె పెద్దగా కాంట్రవర్సీ కాలేదు. అందుకే ఏనాడూ ఎవరి చేత విమర్శలు సైతం ఎదుర్కోలేదు. మొదటి నుంచి తండ్రితోపాటే టీడీపీలో నడిచిన ఆమె.. ఆరేళ్ల క్రితం కాషాయం గూటికి చేరారు. ఇప్పుడు బీజేపీలో ఆమెకు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. Also Read: ఆ ఓటు బ్యాంక్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ ఆరేళ్ల క్రితం ఆమె చేరిక సందర్భంగా ఆమెను జాతీయ మహిళా మోర్చాలో కీలక నేతగా […]

Written By: Srinivas, Updated On : January 18, 2021 2:50 pm
Follow us on


ఎన్టీఆర్‌‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్‌‌ తనయ పురంధేశ్వరి. ఏనాడూ ఆమె పెద్దగా కాంట్రవర్సీ కాలేదు. అందుకే ఏనాడూ ఎవరి చేత విమర్శలు సైతం ఎదుర్కోలేదు. మొదటి నుంచి తండ్రితోపాటే టీడీపీలో నడిచిన ఆమె.. ఆరేళ్ల క్రితం కాషాయం గూటికి చేరారు. ఇప్పుడు బీజేపీలో ఆమెకు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది.

Also Read: ఆ ఓటు బ్యాంక్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ

ఆరేళ్ల క్రితం ఆమె చేరిక సందర్భంగా ఆమెను జాతీయ మహిళా మోర్చాలో కీలక నేతగా తీసుకున్నారు. ఇక ఈ మధ్యన జాతీయ స్థాయిలో పార్టీలో జరిగిన మార్పుల్లోనూ చిన్నమ్మకు పెద్దపీట వేశారు. ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. దాంతో ఏపీ బీజేపీలో ఆమె హవా ఒక్కసారిగా పెరిగింది.

Also Read: ఆ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు కదా

అయితే.. తాజాగా విశాఖపట్నంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. విశాఖలోని పురంధేశ్వరి నివాసాన్నే ఇందుకు వేదికగా ఏర్పాటు చేశారు. ఇది కూడా గొప్ప విషయమే. విశాఖలోని ఆమె ఇంట్లోనే పార్టీకి చెందిన పెద్దలంతా భేటీ అయి రాష్ట్ర బీజేపీ ఫ్యూచర్ గురించి సీరియస్‌గా చర్చించారు అంటే అది ఆమెకు లభించిన అదనపు గౌరవంగానే చెప్పాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

రానున్న రోజుల్లో బీజేపీ ఉత్తరాంధ్రా మీద ఫోకస్‌ పెడుతోంది. అదే స్థాయిలో ఎన్టీయార్ లెగసీని కూడా తమ వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోంది. దాంతో అనూహ్యంగా పురంధేశ్వరికి పార్టీలో పెద్దపీట వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మరోమారు విశాఖ నుంచి చిన్నమ్మ ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.