spot_img
HomeతెలంగాణHyderabad : హైదరాబాద్‌ సిగలో స్కై విల్లాలు.. పోటీలో బడా కంపెనీలు.. రేట్‌ ఎంత? ఎక్కడ...

Hyderabad : హైదరాబాద్‌ సిగలో స్కై విల్లాలు.. పోటీలో బడా కంపెనీలు.. రేట్‌ ఎంత? ఎక్కడ ఏర్పాటంటే?

Hyderabad :  విశ్వనగరం హైరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీగా మారబోతోంది. ఓఆర్‌ఆర్‌ బయట కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పెట్టుబడులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. దీంతో హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. జిల్లాల్లోనూ హైడ్రా ఏఆర్పాటు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం హైడ్రా హైదరాబాద్‌కే పరిమితమని మొదట ప్రకటించారు. తర్వాత జిల్లాల్లోనే హైడ్రా తరహా వ్యవస్థ ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో జిల్లాల్లోని కబ్జాదారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇలా హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే హైదరాబాద్‌లో ఆకశ హర్మ్యాలు వేగంగా నిర్మాణమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల సౌకర్యాలతో అపార్టుమెంట్లు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ ఆల్ట్రా లగ్జరీ ఇళ్లకే కేరాఫ్‌గా మారుతోంది. ఇప్పటి వరకు నిర్మించి విక్రయించిన వాటిని పక్కన పెడితే నిర్మాణంలో ఉన్న ఇళ్లు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌లో అత్యంత ఖరిదైన ప్రాజెక్టులు, అవి ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం.

– ఎస్‌ఏ.క్రౌన్‌..
రూ.26 కోట్లతో కోకాపేటలో దీనిని నిర్మస్తున్నారు. 60 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఇందులో కొన్ని ప్లాట్ల సైజ్‌ 16 వేల ఎస్‌ఎఫ్టీ వరకూ ఉంటుంది. సాధారణంగా బిల్డర్లు నిర్మించి అపార్టుమెంట్లు వెయ్యి ఎస్‌ఎఫ్‌టీతో డబుల్‌ బెడ్‌ రూం ఉంటుంది. అలాంటిది పదహారు అపార్టుమెంట్ల వైశాల్యం ఉండేలా ఈ ఫ్లాట్‌ ఉంటుంది. దీని విలువ రూ. 26 కోట్లుగా ఉంది. ఇది అపార్టుమెంట్‌లో ట్రిప్లెక్స్‌.. స్కైవిల్లాస్‌లా ఉంటుంది. చూస్తే తప్ప ఆ విలాసాన్ని వర్ణించడం కష్టం.

డీఎస్‌ఆర్‌ ట్విన్స్‌..
రూ.23 కోట్లు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో సిద్ధమవుతున్న టవర్‌ డీఎస్‌ఆర్‌ ది ట్విన్స్‌. అత్యంత లగ్జరీ ఇళ్ల నిర్మాణంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఇమేజ్‌ పెంచుకునేలా ది ట్విన్స్‌ను డిజైన్‌ చేశారు. ఒక్కో ప్లాట్‌ సుమారు 16 వేల ఎస్‌ఎఫ్టీతో ఉంటాయి. ఒక్కో ఇంటి ఖరీదు రూ.23 కోట్ల వరకూ ఉంది.

డీఎస్‌ఆర్‌ ది వరల్డ్‌..
రూ. 22 కోట్లతో డీఎస్‌ఆర్‌ ది వరల్డ్‌ పేరుతో మరో ప్రాజెక్టును డీఎస్‌ఆర్‌ సంస్థ జూబ్లిహిల్స్‌లో చేపట్టింది. ఇందులో ఒక్కో అపార్టుమెంట్‌ సైజ్‌ 13 వేల ఎస్‌ఎఫ్టీ ఉటుంది. ఇందులో ఒక్కో ఫ్లాట్‌ ధరను రూ. 22 కోట్లుగా ఖరారు చేసి అమ్ముతున్నారు.

కాండ్యూర్‌ స్కైలైన్‌..
రూ.19 కోట్లతో కాండ్యూర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. స్కైలైన్‌ పేరుతో మరో లగ్జరీ అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌ ను నిర్మిస్తోంది. స్కై డోమ్‌ టవర్‌లో సుమారు 11,900 ఎస్‌ఎఫ్‌టీతో ఫ్లాట్స్‌ సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక్కో ఫ్లాట్‌ విలువ సుమారు రూ.19 కోట్లు ఉంటుంది. దీనిని విదేశీ ఆర్కిటెక్‌లతో డిజైన్‌ చేయించారు. దీంతో వరల్డ్‌ క్లాస్‌ లగ్జరీని స్కైలైన్‌ ఆఫర్‌ చేస్తోంది.

మైహోమ్‌ కోకాపేట..
రూ.18 కోట్లు మైహోమ్‌ చేపట్టిన ప్రాజెక్టుల్లో బయోడైవర్సిటీ దగ్గర ఉన్న మైహోమ్‌ భూజానే అతి పెద్ద లగ్జరీ అపార్టుమెంట్‌ ప్రాజెక్టు. ఇందులో ఒక్కో ఫ్లాట్‌ కనీసం రూ.15 కోట్లు ఉంటుంది. కానీ కట్టేటప్పుడు అంత లేదు. తాజాగా కోకాపేట నియోపోలిస్‌లో కొత్త ప్రాజెక్టును అత్యంత లగ్జరీగా పది వేల ఎస్‌ఎఫ్‌టీతో ఆఫర్‌ చేస్తోంది. ధర రూ.18 కోట్లుగా నిర్ణయించింది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ స్వరూపం మారుతున్న వైనం తెలుసుకుని ఆహా.. ఓహో అనుకోవడం తప్పం కొనాలంటే.. బడాబాబులైనా ఆలోచించాల్సిందే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular