MP Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ కేసు..? రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై విద్యుత్‌ విచారణ కమిషన్‌ ఇప్పటికే కేసీఆర్‌కు రెండో రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది.

Written By: Raj Shekar, Updated On : June 13, 2024 5:49 pm

MP Raghunandan Rao

Follow us on

MP Raghunandan Rao: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కూడా ముందుంది మొసళ్ల పండుగ అనని పేర్కొన్నారు.

గొర్రెల స్కాంపై నోటీసులు..
తెలంగాణ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై విద్యుత్‌ విచారణ కమిషన్‌ ఇప్పటికే కేసీఆర్‌కు రెండో రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. తాజాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గొర్రెల పథకంలో జరిగిన అవకతవలకపై ఈడీ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందని రఘునందన్‌రావు తెలిపారు. కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

వెంకట్రామిరెడ్డి స్థానికేతరుడు..
ఇక బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మెదక్‌లో స్థానికేతరుడు అని పేర్కొన్నారు. అందుకే అతను లోక్‌సభ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని తెలిపారు. ఖర్చు చేసిన డబ్బులు అన్నీ కక్కిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరు మంచోళ్లో వారినే గెలిపించారని తెలిపారు. అన్యాయం చేసినోడినే ఓడించారన్నారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమా డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దుబ్బాకలో ఓడిపోయినా.. మెదక్‌లో ఓడించలేదని వ్యాఖ్యానించారు.

బూత్‌ కమిటీ అధ్యక్షుల గెలుపు..
ఇక మెదక్‌లో తన గెలుపు గురించి కూడా రఘునందన్‌ మాట్లాడారు. తన గెలుపు పూర్తిగా బీజేపీ బూత్‌ కమిటీల గెలుపన్నారు. దుబ్బాకలో దెబ్బకొట్టిన అని ఆరడుగుల హరీశ్‌ ఎగిరిండని పేర్కొన్నారు. తనను గెలిపించిన మెదక్‌ ప్రజలకు జీవితీకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

ఈడీ కేసు నిజమేనా..
ఇదిలా ఉంటే.. రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే ఈడీ కవిత లిక్కర్‌ స్కాం గురించి కేసీఆర్‌కు అంతా తెలుసు అని కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఈడీ నోటీసులు ఇచ్చిందా.. లేక గొర్రెల పథకం కేసులో జరిగిన అవినీతిపై ఈడీ కేసు నమోదు చేసిందా అన్న చర్చ జరుగుతోంది. గొర్రెల స్కాంపై ఈడీ రంగంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే మెదక్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపేందుకే రఘునందన్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.