Homeప్రవాస భారతీయులుATA Convention 2024: అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్‌.. రికార్డు స్థాయిలో తెలుగు వారు...

ATA Convention 2024: అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్‌.. రికార్డు స్థాయిలో తెలుగు వారు హాజరు!

ATA Convention 2024: అమెరికా గడ్డపై నిర్వహించిన 18వ ఆటా కన్వెషన్‌ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. నవత, యువత, భవిత నినాదంతో మార్మోగింది. జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో జూన్‌ 7 నుంచి జూన్‌ 9 వరకు అట్లాంటాలో ఈ వేడుకలు నిర్వహించారు. 18వ వేడుకకు 18 వేల మందికిపైగా తెలుగువారు హాజరుకావడం మరో విశేషం. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్‌ కిరణ్‌ పాశం సారథ్యంలో తొలి రోజు బ్యాంకెట్‌ సమావేశం జరిగింది. ఇందుఏలో తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, కాన్సులేట్‌ జనరల్‌ రమేశ్‌బాబు, లక్ష్మణ్, ధాన్య గురు దాజీ, సినీ నటులు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్‌ మెహ్రీన్, నేశాశెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి హాజరయ్యారు.

తెలుగు వారి సేవలకు అభినందన..
ఇక ఈ సమావేశాలకు హాజరైన జార్జియా గవర్నర్‌ బ్రయాన్‌ కెంప్‌ మాట్లాడుతూ జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగురవాఉ తోడ్పడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా తమకు ఈలక భాగస్వామి అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.

యువత భవిష్యత్‌కు పెద్దపీట..
నవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈ 18వ కన్వెన్షన్‌ వేడుకలు నిర్వహించామని ఆటా అధ్యక్షుడు ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జయంత్‌ చల్లా, అధ్యక్షురాలు మధు బొమ్మినేని తెలిపారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్‌లో పాల్గొన్న అందరికీ దన్యవాదాలు తెలిపారు. ఆటా నవల పోటీలు, త్రీఓరి మ్యూజికల్‌ కాన్సర్ట్‌ చాలా వినూత్నంగా, యువతను ఆకర్షిచేలా నిర్వహించారు. ఈలలు, గోలలతో కన్వెన్షన్‌ ప్రాంగణం మార్మోగింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున..
ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు హాజరయ్యారు. యూత్‌ కమిటీ సమ ఆవేశాలు ఈసారి హైలెట్‌గా నిలిచాయి. ఏఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ అండ్‌ ఏ, వివిధ విషయాలపై డిబేట్స్‌ ఆకట్టుకున్నాయి. ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మహిళా సాధికారత, గృహ హింస, వంటి అంశాలపై చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్‌తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు.

బిజినెస్‌ ఫోరంలో మంత్రులు..
ఇక కన్వెన్షన్‌లో భాగంగా నిర్వహించిన బిజినెస్‌ ఫోరంలో తెలంగాణ మంత్రులు వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబుతోపాటు కాన్సులేట్‌ జనరల్‌ రమేశ్‌బాబు, తెలంగాణ ఐటీ అడ్వయిజర్‌ రవి తంగిరాల పాల్గొన్నారు. ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జయంత్‌ చల్లా మోడరేటర్‌గా వ్యవహరించారు. ఎప్పుడూ లేనివిధంగా బిజినెస్‌ పిచ్చింగ్‌ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్‌ ఫోరంలో ఏఐ వంటి అత్యాధునిక విషయాపై చర్చ జరిగింది. ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్‌ ఎన్‌ఆర్‌ఐ ఇష్యూస్‌ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణ, అమెరికా పొలిటికల్‌ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చించారు. సాహిత్య ఫోరంలో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి.

ఆకట్టుకున్న అష్టావధానం..
ఇక వేడుకల్లో అష్టావధానం ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి, గంగాధరశాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. బ్యూటీ పెజెంట్‌ వేరే లెవల్‌లో జరిగింది. గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్‌ కిరీటాలను అందించారు. జీవిత భాగస్వాములు కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీకమలేశ్‌ పటేల్‌ పొల్గొని ప్రేక్షకులకు సందేశం ఇచ్చారు. థమన్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉప్రూతలూగించారు.

17 మందికి ఆటా అవార్డులు..
ఇక ఈ కన్వెన్షన్‌లో వివిధ రంగాలలో ప్రతిభా పాటవాలు చూసిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. మాజీ అధ్యక్షుడు భువనేష్‌ బూజాల, హరి ప్రసాద్‌రెడ్డి లింగాల, రామకృష్ణరెడ్డి అల, సాయినాథ్‌ బోయినపల్లి, విజయ్‌ కుందూరు, రాఘువీరారెడ్డికి అవార్డులు, ఆటా లైఫ్‌టైమ్‌ సర్వీస్‌ అవార్డును డాక్టర్‌ రాజేశ్వర్‌రావు టేక్మాల్‌కు అందజేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్, జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిని సత్కరించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version