Echoes Restaurant Hyderabad: బొబ్బిలి రాజా సినిమా చూశారా.. అందులో బలపం పట్టి భామ వల్లో అనే ఒక పాట ఉంటుంది. అందులో కొమ్మల్లో కుకూలు.. కొండల్లో ఎకోలు.. చరణం ఉంటుంది. ఇక అంటే ప్రతిధ్వని అని అర్థం. ఇప్పుడు అదే పేరుతో హైదరాబాద్ నగరంలో ఒక రెస్టారెంట్ ఏర్పాటయింది. అయితే ఇది రొటీన్ రెస్టారెంట్ కాదు. ఇందులో పనిచేసే వారి దగ్గర నుంచి మొదలు పెడితే.. లభించే ఆహారం వరకు ప్రతిదీ కూడా ప్రత్యేకమే.
Also Read: కరీంనగర్ నుంచి రియాద్…అంతర్జాతీయ మార్కెట్‌లోకి మన రుచులు
ఎకోస్ రెస్టారెంట్ కోకాపేట, మాదాపూర్ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. దీని నిర్వాహకులు మొట్టమొదటి రెస్టారెంట్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అక్కడ మంచి పేరు రావడంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్లో క్యూ కార్డులు, చేతి చిహ్నాలు, టేబుల్ బెల్ ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేయాలి. ఎందుకంటే ఇందులో పనిచేసే సిబ్బందికి మాటలు రావు. ఒక రకంగా వారంతా కూడా ప్రత్యేకమైన వ్యక్తులు. అందువల్ల వెయిటర్ అని బిగ్గర గా అరవాల్సిన అవసరం ఉండదు. ఈ రెస్టారెంట్ గోడల మీద ఆకట్టుకునే సూక్తులు ఉంటాయి. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మన ఇంటిలోనే ఆహారం తింటున్న అనుభూతి కలుగుతుంది. ఒకరకంగా మాటల కందని అనుభవం.. కడుపునిండా సంతృప్తి ఇందులో లభిస్తాయి.. దివ్యాంగులకు ఉద్యోగాలు, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడానికి ఎకోస్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. ఇందులో చీజ్ పిన్ వీల్ పాస్తా, తందూరి మోమోలు, సిగ్నేచర్ చీజ్ బ్లాంకెట్ పిజ్జా ప్రత్యేకంగా ఉంటాయి.. వీటి కోసం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. బ్లూబెర్రీ షేక్, రిచ్ హాట్ చాక్లెట్ ఇక్కడి ప్రత్యేకమైన డ్రింక్స్. ఈ రెస్టారెంట్ ఇండో, ఇటాలియన్ స్టైల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఆసియన్ బైట్స్, ఫ్యూజన్ స్నాక్స్, డెజర్ట్ వంటివి ప్రత్యేకంగా ఉంటాయి.
Also Read: కోహ్లీ రెస్టారెంట్లో మొక్కజొన్న ఖరీదు అంతా? బాబోయ్ మూడు బిర్యానీలు అవలీలగా కొనొచ్చు ..
ఈ రెస్టారెంట్ ను పూర్తిగా వుడెన్ మోడ్ లో కష్టమైస్ చేశారు. గోడల మీద డూడుల్స్ ఆకర్షణీయంగా రూపొందించారు. టేబుల్ సెట్టింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. టేబుల్ ఆర్డరింగ్ కార్డులు, సంకేతాలు, వచ్చిన వారితో సులభంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంటాయి. రెస్టారెంట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో మినిమం బిల్ 1,000 వరకు ఉంటుంది. కోకాపేట ప్రాంతంలో ఆర్థికంగా స్థితి మంతులు ఉంటారు కాబట్టి.. వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వంటకాలను అందుబాటులో ఉంచారు. అవన్నీ కూడా మన రొటీన్ ఫుడ్ లాగా ఉండవు. వినికిడి సమస్య, మూగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్కరి వేతనశ్రేణి 25వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. చెఫ్ లలో కూడా మూగ, చెవిటివారిని నియమించారు. మన దేశంలో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నప్పటికీ.. బధిరులకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ మాత్రం ఇదే. వంటకాలు అద్భుతమైన రుచితో ఉండడంతో కస్టమర్లు కూడా భారీగానే వస్తున్నారు. కాకపోతే ఈ రెస్టారెంట్ రొటీన్ రెస్టారెంట్ల మాదిరిగా ఉండదు. ఇందులోకి వెళ్తే మన ఇంట్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.. ఆకట్టుకునే వాల్ పెయింటింగ్స్.. డూడుల్స్.. వాటర్ ఫౌంటెన్.. టేబుల్ సెట్టింగ్..క్యూ కార్డులు.. ఇవన్నీ కూడా ఈ రెస్టారెంట్ ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.