Vulgar Dialogues Ban: ఈమధ్య కాలం లో సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అయిపోయాయి. సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు పరిమితులు పెట్టినప్పటికీ కూడా,యూత్ ఆడియన్స్ ని అలరించే క్రమం లో మేకర్స్ పరిధులు దాటి మరీ కొన్ని హద్దులు దాటిన డైలాగ్స్ పెడుతున్నారు. ముఖ్యంగా టీవీ షోస్ అయితే ఆడవాళ్ళ గురించి అత్యంత నీచమైన డైలాగ్స్ పెడుతున్నారు. వాటికి ఆ షో కి వచ్చిన వాళ్ళు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఇక ఓటీటీ షోస్ అయితే ఎప్పుడో హద్దులు చెరిపివేశాయి. వెంకటేష్ లాంటి టాప్ స్టార్ తో కూడా ఆడవాళ్ళ గురించి నీచమైన డైలాగ్స్ పలికించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదే కొనసాగితే రాబోయే తరం వారికి కూడా ఆడవాళ్ళ విలువ తెలియదు, డబుల్ మీనింగ్ అడల్ట్ డైలాగ్స్ వెయ్యడం నేర్చుకుంటారు. దీనిని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి.
Also Read: గొప్ప పొలిటీషియనే కాదు.. నారా లోకేష్ ఓ మంచి ‘ఫ్యామిలీ మ్యాన్’ కూడా..
అందుకే ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నిన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో సినిమాల్లో,టీవీ షోస్ లో, ఓటీటీ షోస్ లో ఆడవాళ్ళ గురించి చాలా నీచమైన డైలాగ్స్ వాడుతున్నారు. దీనిని కంట్రోల్ చేసే చర్యలు సీఎం చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూర్చిని చర్చలు జరిపి తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో పాటు నారా లోకేష్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. బస్సు లో కూడా మహిళలతో కలిసి వీళ్ళు ప్రయాణించారు.
Also Read: నారా లోకేష్ సపోర్టు ‘కూలీ’ కే..పరోక్షంగా ‘వార్ 2’ చూడొద్దు అంటున్నాడా?
అనంతరం ఏర్పాటు చేసిన సభలో నారా లోకేష్ ప్రసంగం సమయం లో ఈ రిక్వెస్ట్ ని కోరాడు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ విషయం పై చర్చలు జరిపి ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ప్రత్యేక చట్టం తెస్తే కచ్చితంగా అభినందించదగ్గ విషయమే అనుకోవాలి. కంట్రోల్ చేయడం చాలా పెద్ద టాస్క్, కానీ కొంత అయినా న్యూట్రల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో కంటే కూడా టీవీ షోస్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి. ఈమధ్య చాలా ఓవర్ అయిపోతుంది. ప్రభుత్వ పాలకుల నోటి నుండి కంట్రోల్ చెయ్యాలి వంటి పదాలు వచ్చాయి కాబట్టి, టీవీ షోస్ ని నిర్వహించే వాళ్ళు ఇది తెలుసుకొని ముందు జాగ్రత్తతో ఆపేస్తే బెటర్.