కోహ్లీకి హైదరాబాదు నగరంలోనూ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా భారీ స్థాయిలో ధరలు ఉన్నాయని గతంలో చర్చ జరిగింది. ఈ రెస్టారెంట్లో ఉడకబెట్టిన ప్లేట్ కంకులకు 525 చెల్లించినట్టు యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది ఒక్కసారిగా సంచలనం గా మారింది. ఈ క్రమంలో కొంతమంది ఆమెకు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు ఆమె తీరును తప్పు పడుతున్నారు.. లగ్జరీ హోటల్స్ లో అంబియన్స్ కు ఆ మాత్రం ధర ఉంటుందని.. అది తెలియకుండా అక్కడికి ఎందుకు వెళ్లారని కొంతమంది అంటుంటే.. ఇంకొందరేమో one 8 commune మొత్తానికీ మీరు చెల్లించారేమో అని కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ యువతి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కేవలం ఉడకబెట్టిన ప్లేటు మొక్కజొన్న కంకులకు 525 రూపాయలు తీసుకుంటుంటే.. ఇక బిర్యానీలు, ఇతర వాటికి ఎంత తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. ధరలు చూస్తుంటేనే బాబోయ్ అనిపిస్తోందని.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కు వెళ్లాలంటే వ్యాలెట్ నిండా డబ్బులు తీసుకెళ్లాలని నెటిజన్లు ఆ యువతిని ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాదులోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ one 8 commune లో ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులు ఆర్డర్ చేసిన ఓ యువతికి 525 బిల్లు వేశారు.. దీంతో ఆ యువతి ఒక్కసారిగా కంగుతిన్నారు. దానిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. #ViratKohli#ViratKohlirestaurant#one8commune pic.twitter.com/5QhNEcpaWK
— Anabothula Bhaskar (@AnabothulaB) January 13, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Is the price of corn in kohlis restaurant all that much you can buy three biryanis
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com