Hero Vijay Tears: తమిళనాడు లో ప్రస్తుతం నెంబర్ 1 హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు విజయ్(Thalapathy Vijay). ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) పేరు వినిపించేది. ఇప్పుడు విజయ్ ఆ స్థాయికి ఎదిగాడు. ఆయన ఫ్లాప్ టాక్ సినిమాలు సైతం సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళిపోతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం విజయ్ మేనియా తమిళనాట ఏ రేంజ్ లో నడుస్తుంది అనేది. కెరీర్ లో ఇలాంటి పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయడం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. అయితే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలను కొనసాగిస్తాడేమో అని అభిమానులు ఆశించారు. కానీ అది జరగని పని అని ఇప్పటికే విజయ్ అనేకసార్లు క్లారిటీ గా చెప్పాడు. ప్రస్తుతం ఆయన వినోద్ దర్శకత్వం లో ‘జన నాయగన్’ అనే చిత్రం చేస్తున్నాడు.
టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు, కానీ అప్పుడే పూర్తి అయ్యింది. ఇది తన చివరి సినిమా కావడంతో షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా విజయ్ మూవీ టీం మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ లో ఆయన కాస్త భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్టు కోలీవుడ్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇన్నేళ్లు సినీ ఇండస్ట్రీ ఆయనకు ఉన్నటువంటి అనుబంధం సాధారణమైనది కాదు. తనని ఇంత పెద్ద వాడిని చేసిన ఇండస్ట్రీ ని వదిలి రాజకీయ రణరంగంలోకి దూకబోతుండడం తో ఒక్కసారిగా ఆయనకు తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తుకు వచ్చినట్టు ఉంది. అందుకే బాగా ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా విడుదలైన రెండు నెలలకే తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంది. ఈ ఎన్నికలలో విజయ్ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుంది అనే దానిపై తమిళనాడు లో పెద్ద చర్చ నే నడుస్తుంది. తమిళనాడు లో సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం కొత్తేమి కాదు. MGR , జయలలిత, కరుణానిధి వంటి వారు ముఖ్యమంత్రులుగా కొనసాగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అదే తరహా లో విజయ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే విజయ్ ప్రభావం తమిళనాడు ఎన్నికల్లో ఏమాత్రం ఉండదని తీసిపారేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో అందరూ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతుంటే, విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమయ్యాడు. మరి ఈయన వెంట అభిమానులు ఏమేరకు నడుస్తారో చూడాలి.