HomeతెలంగాణTelangana Media Politics: అటు అధికార పక్షం.. ఇటు విపక్షం.. వారెవా మేనేజ్ చేయడం లో...

Telangana Media Politics: అటు అధికార పక్షం.. ఇటు విపక్షం.. వారెవా మేనేజ్ చేయడం లో ఈ మీడియా అధినేత తీరే వేరు..

Telangana Media Politics: ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టారు. ఆ తర్వాత కష్టపడి చదువుకొని ఫార్మా రంగంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఆయన ముట్టుకున్న ప్రతిదీ బంగారమైంది. ఆయన వేసిన అడుగు బలంగా నిర్మితమైంది. ఫలితంగా చూస్తుండగానే వందలు దాటేసి వేల కోట్లకు ఎదిగారు.

ఈ వేల కోట్లలో చాలామంది డబ్బులు ఉన్నాయి. అందులో అధికార పక్షానికి.. ప్రతిపక్షానికి వాటా ఉంది. అంటే అధికార పార్టీలో ఉన్న నాయకులకు.. ప్రతిపక్ష పార్టీల నాయకులకు సదరు ఫార్మా అధినేత బినామీ అన్న మాట. డబ్బు విపరీతంగా రావడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు.

రెండు అక్షరాల పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశారు. మొదట్లో అధికార పక్షానికి భజన చేశారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా ఆదే స్థాయిలో స్పేస్ ఇస్తున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మొన్నటి దాకా ప్రతిపక్షం మీద తన మీడియా సంస్థ లో పూర్తి నెగిటివ్ వార్తలు ప్రసారం చేయించిన ఆ మీడియా అధినేత ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. ప్రతిపక్షానికి కూడా బీభత్సంగా స్పేస్ ఇస్తున్నాడు. ప్రతిపక్షంలో కూడా ఒక కీలక నాయకుడికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు.

సదరు మీడియా అధినేత ఇంటికి ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న కీలక నాయకుడు వెళ్లారు. ఆయనతో గంటలపాటు మాట్లాడారు. దీంతో ఆ మీడియా అధినేత, ప్రతిపక్ష పార్టీలోని కీలక నాయకుడి మధ్య ఏం జరిగింది? వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఎక్కడిది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి గురించి ప్రతిపక్ష పార్టీలోనే పెద్ద తలకాయలు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

“మొదట్లో ఆ మీడియా అధినేత సదరు ప్రతిపక్ష పార్టీలోని కీలక నాయకుడి మీద నెగిటివ్ వార్తలు ప్రసారం చేయించారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా పాజిటివ్ కథనాలను ప్రసారం చేయిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ లోని ఓ ముఖ్య నాయకుడికి బినామీగా ఉన్న సదరు మీడియా అధినేత కం ఫార్మా అధినేత.. ఇప్పుడు ఇలా మారిపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరిగే ఎన్నికల్లో తన స్వస్థలం నుంచి ఈ మీడియా అధినేత పోటీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికార పక్షానికి లేకుంటే ప్రతిపక్షానికి కొమ్ము కాసే మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఉభయకుశలోపరి అనే ట్యాగ్ లైన్ తనమీద వేసుకున్నాడు. ఫలితంగా ఇదిగో అటు అధికార పార్టీకి.. ఇటు ప్రతిపక్ష పార్టీకి సంధాన కర్తగా వ్యవహరిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version