Praja Bhavan
Praja Bhavan: ప్రజాభవన్(ప్రగతి భవన్).. మొన్నటి వరకు సీఎం కేసీఆర్ అధికారిక నివాసం. శత్రు దుర్భేద్యమైన ఇనుప కంచెలు.. ముళ్ల కంచెలు.. మూడంచెల భద్రత.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ భవనం ఉన్నా కేసీఆర్ దీనిని ఓ గడీగా మార్చేశారు. ఇక్కడికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది అధికారులు, అప్పుడప్పుడూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చేవారు. అనుమతి ఇచ్చేవారు. కేసీఆర్ అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోనికి చిన్న చీమ కూడా అడుగుపెట్టేది కాదు. ఇక ప్రతిపక్షాలకు ఆ గేట్లు తెరుచుకునేవి కావు. బాధలో ఉన్నాం.. ముఖ్యమంత్రిని కలిసి బాధ చెప్పుకుందామంటే అనుమతి ఇచ్చేవారు కాదు. ఇదంతా వారం క్రితం వరకే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజాధనంతో నిర్మించిన భవనంలోకి ప్రజలకే అనుమతి లేకుండా చేసిన కేసీఆర్ సర్కార్‌ను తెలంగాణ ప్రజలు గద్దె దించారు. ప్రగతి భవన్ నుంచి బయటకు పంపించారు. కాంగ్రెస్‌ను ఎన్నికల్లో గెలిపించారు.
ప్రమాణస్వీకారం రోజే కంచె తొలగింపు..
ఎన్నికలకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ గేట్లు బద్ధలు కొడతామని ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్ ముందు ఏర్పాటు చేసిన భారీ ఇనుప కంచెలు, ముళ్ల కంచెలను తొలగించారు. ఇప్పుడు ప్రజతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రమాణం చేసిన మరుసటి రోజే అందులో ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రస్తుతం వారంలో రెండుసార్లు(మంగళ, శుక్రవారాల్లో) ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా కూడా మార్చారు.
తండోపతండాలుగా ప్రజలు..
ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యలు, కబ్జాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలపై ఫిర్యాదలు ఇస్తున్నారు. ఇదే సమయంలో కళ్లు చెదిరే రీతిలో కేసీఆర్ నిర్మించుకున్న ప్రజాభవన్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా తమ సొమ్ముతో కట్టుటకుని రాజభోగాలు అనుభవించారని, తమకు మాత్రం ఇందులో అనుమతి లేకుండా చేశారని చర్చించుకుంటున్నారు. రేవంత్ రాకతో ప్రగతిభవన్‌లో అడుగు పెట్టే అవకాశం వచ్చిందంటున్నారు.
బీఆర్‌ఎస్ నాయకులకూ ఆహ్వానం..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా చాలా మంది ప్రగతి భవన్‌లోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఇలాంటి వారు కూడా ప్రగతి భవన్‌కు వచ్చి చూసి వెళ్లొచ్చని కాంగ్రెస్ నేతుల ఆహ్వానిస్తున్నారు. ప్రగతి భవన్‌ను ఎలా గడీగా మార్చారో వీడియోలు తీసి షోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ప్రజాభవన్∙కాదు ఇంద్రభవన్..
తాజాగా ప్రజాభవన్ గురించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమహల్‌కు ఏమాత్రం తీసిపోకుండా కేసీఆర్ ఈ భవనాన్ని ఇష్టంగా నిర్మిచంకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాజ దర్పం తొణికిసలాడేలా కాస్ట్ లీ ఫర్నిచర్ తో సుందరమైన గదులు కనిపిస్తున్నాయి. విశాలమైన హాల్, అతిపెద్ద డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరిమిట్లు గొలిపే లైటింగ్ తో ప్రజా భవన్ ఇంద్ర భవనాన్ని తలపిస్తోందని ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారని, ఇదంతా ప్రజల సొమ్మే గా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రజాభవన్ కాదు ఇంద్రభవన్.. ఈ వీడియో చూస్తే మీరే షాకవుతారు…!!#PragathiBhavan #PrajaBhavan #KCR #CMRevanthReddy #RevanthReddy #Oneindiatelugu pic.twitter.com/kXqsI7b5QK
— oneindiatelugu (@oneindiatelugu) December 15, 2023
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Do you know what praja bhavan looks like inside viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com