Homeప్రత్యేకంPindam Review: పిండం ఫుల్ మూవీ రివ్యూ

Pindam Review: పిండం ఫుల్ మూవీ రివ్యూ

Pindam Review: ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా నడుస్తున్నాయి. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన హర్రర్ మూవీస్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది.ఇలాంటి సినిమా ల్లో కొద్దిపాటి అంశాలు ప్రేక్షకులకు నచ్చిన కూడా ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయడంలో ప్రేక్షకులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అలాంటి కథాంశంతో ఈవారం మన ముందుకు వచ్చిన సినిమానే పిండం అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నచ్చింది చాలా రోజుల తర్వాత మళ్లీ మేన్ లీడ్ లో చేస్తున్న శ్రీరామ్ కి ఈ క్యారెక్టర్ ఎంతవరకు హెల్ప్ అయింది అనేవి మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ సినిమా కథలోకి వస్తే ఆంటోనీ ఒక రైస్ మిల్ లో అకౌంటెంట్ గా పని చేస్తూ ఉంటాడు. తన భార్య, ఇద్దరు పిల్లలు వాళ్ల అమ్మ తో కలిసి చాలా ఆనందం గా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే తను ఒక గ్రామంలో అతి పురాతనమైన ఇల్లును కొని దాంట్లోనే నివాసం ఉండటానికి వెళ్తాడు అక్కడే కొద్ది రోజులు ఉన్నాక అతనికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య హాస్పిటల్ లో చేరుతుంది. వాళ్ళ అమ్మకి ప్రమాదం జరుగుతుంది. ఇలా అన్ని చెడుపరిణామాలు సూచించడంతో ఇంట్లో ఏముంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి క్షుద్ర పూజలు చేసే అన్నమ్మ ( ఈశ్వరి రావ్) ని ఇంటికి పిలిపించి చూపిస్తాడు దాంతో ఇంట్లో ఉండకూడని ఏదో దుష్ట శక్తి ఉందని ఆమె నిర్ధారణ చేస్తుంది. మరి ఆంటోనీ ఫ్యామిలీని అన్నమ్మ ఆమె స్నేహితుడు అయిన అవసరాల శ్రీనివాస్ కలిసి కాపాడతారా ..? అసలు వాళ్ళింట్లో ఏముంది వాళ్ళింట్లోనే అ దుష్ట శక్తి ఉండడానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకోవాలంటే మాత్రం పిండం సినిమాని చూడాల్సిందే…

సినిమా విశ్లేషణ విషయానికి వస్తే నటుడు శ్రీరామ్ ఇప్పటివరకు లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ జానర్ లో ఒక డిఫరెంట్ మూవీ ని అయితే ట్రై చేశాడు.నిజానికి ఈ సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ అనేవి బాగున్నాయి. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ గాని దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే విధానం గాని ప్రేక్షకులను అధ్యంతం కట్టిపడేసేలా ఉన్నాయి. కొన్నిచోట్లలో హర్రర్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.అది చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా తప్పకుండా భయపడతాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ సినిమాలో ముఖ్యంగా మిస్సయిన పాయింట్ ఏంటి అంటే ఆ హర్రర్ ఎలిమెంట్స్ కి వచ్చే రీజన్స్ ని మ్యాచ్ చేయడంలో లాజికల్ గా కొంతవరకు దర్శకుడు ఆడియన్స్ ని కన్విన్స్ చేయలేకపోయాడు. కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా ఇల్ లాజికల్ గా అనిపిస్తాయి.ఇక ఫస్టాఫ్ దాకా సినిమాని గ్రిపింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమాని ఎలా నడిపించాలో తెలియక అక్కడక్కడ తడబడ్డట్టు గా కనిపిస్తుంది.అలాగే ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ కూడా దానికి కారణం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సినిమా డైరెక్టర్ అయినప్పటికీ సినిమాని టేక్ ఆఫ్ చేసిన విధానం బావుంది. కానీ హారర్ ఎలిమెంట్స్ పాయింట్స్ ని తీసుకున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి ఏ ఒక్క ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అవ్వకపోయిన హార్రర్ లో ఏదో మిస్టేక్ చేసామని అర్థం చేసుకోవాలి .

డైరెక్టర్ సాయికిరణ్ కొంతవరకు హార్రర్ ఎలిమెంట్స్ ని కొద్దివరకు డీల్ చేసినప్పటికీ ఇంకా హారర్ ఎలిమెంట్స్ ని మాత్రం 100% పొట్రే చేయలేకపోయాడు…
ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఓకే అనిపించినప్పటికీ చివర్లో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మిగులుతూనే ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం రొటీన్ క్లైమాక్స్ ని పెట్టి ప్రేక్షకులందరిని చాలా వరకు నిరాశపరచాడు సినిమా ఆద్యంతం ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉండాలి అలా ఉన్నప్పుడే ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని అంగీకరిస్తాడు కానీ ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ రెండు కూడా రొటీన్ గా ఉండటం తో ఈ సినిమాకి అది చాలా వరకు మైనస్ అయింది అనే చెప్పాలి…. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ కొంతవరకు ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్ట్ చేసినప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం సగటు ప్రేక్షకుడి ని 100% సంతృప్తి పరచ లేకపోయింది. మరీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా అయితే కాదు. అలాగని తీసేసెంత అంత సినిమా కూడా కాదు…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నటుడు శ్రీరామ్ చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ మీద ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు కనిపించి వాళ్ళని మెప్పించాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి మంచి పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్ లో కూడా ఆయన కరెక్ట్ గా ఒదిగిపోయి చాలా మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. దీంతో ఆయనకు సినిమాలో మరికొన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి…ఇక శ్రీ రామ్ భార్యగా నటించిన ఖుషి కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది అలాగే భూత వైద్యురాలిగా ఈశ్వరి రావ్ తన పరిధి మేరకు ఓకే అనిపించినప్పటికీ కొన్ని సీన్లలో మాత్రం ఆమె కాకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసి ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని సీన్లలో ఆ భూత వైద్యురాలకి ఉండే ఇంటెన్స్ ని ప్రదర్శించలేదు అనేది స్పష్టం గా కనిపిస్తుంది. ఇక అవసరాల శ్రీనివాస్ కూడా ఓకే అనిపించాడు..

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలావరకు ఎలివేట్ చేసింది. సంతోష్ మనోహరన్ సినిమాటోగ్రఫీ విజువల్ గా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హార్రర్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఇచ్చాడు. ఇక ఎడిటర్ కూడా కొన్ని సీన్లలో షార్ప్ ఎడిటింగ్ ఇచ్చినట్టయితే హార్రర్ సీన్లు ఇంకా హైలైట్ అయ్యేవి…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

కొన్ని హర్రర్ సీన్స్
శ్రీరామ్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్

ఏంటంటే
రొటీన్ స్టోరీ
డైరెక్షన్ (కొన్ని సీన్లలో మైనస్ అయింది)
సెకండాఫ్…

హార్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ వీకెండ్ లో ఫ్యామిలీ తో కలిసి ఒకసారి ఈ సినిమాని చూడవచ్చు…

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular