HomeతెలంగాణSmita Sabharwal: 12Th ఫెయిల్ : ఇంతకీ స్మిత సభర్వాల్ ఇంటర్ మార్కులు ఎన్నో తెలుసా?

Smita Sabharwal: 12Th ఫెయిల్ : ఇంతకీ స్మిత సభర్వాల్ ఇంటర్ మార్కులు ఎన్నో తెలుసా?

Smita Sabharwal: 12th ఫెయిల్ సినిమా ఒక ప్రేరణ అని ఐఏఎస్‌ అధికారి స్మితాసభర్వాల్‌ అన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణత ఒక మధురమైన జ్ఞాపకమని పేర్కొన్నారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దీనికి ఆమె ఇంటర్‌లో సాధించిన మార్కుల మెమో ఫొటో జోడించారు. ‘‘నా 12వ తరగతి ఫలితాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. పెద్ద కలలు కనేలా ప్రేరేపించాయి. జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కఠినమైన పరీక్షల్లో UPSC ఒకటి. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న వారికి కష్టపడేతత్వం, స్మార్ట్ వర్క్ అవసరం’’ అని రాసుకొచ్చారు. ఇక ఇంటర్‌తో తనకు వచ్చిన 461 మార్కుల మెమోను జత చేశారు.

తెలంగాణ ఫైనాన్స్ కమిషన్‌ కార్యదర్శిగా..
దాదాపు పదేళ్లు తెలంగాణ సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన స్మితాసబర్వాల్‌.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమెను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్‌ కార్యదర్శిగా నియమించింది. బదిలీ తర్వాత సుమారు పక్షం రోజులు సెలవుపై వెళ్లారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా..
స్మితాసబర్వా్ల్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. రోజువారీ కార్యక్రమాలను కూడా పోస్టు చేస్తునా‍్నరు. వెకేషన్స్‌, హాలిడే ట్రిప్స్‌, విధి నిర్వహణలో పెద్దలను కసిలిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 12 ఫెయిల్‌ సినిమాను గుర్తుచేస్తూ తన 12వ తరగతి గురించి తన అభిప్రాయం పంచుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version