Homeఎంటర్టైన్మెంట్Mrunal Thakur: నావి అలా లేవని అవమానించారు... సంచలనం రేపుతున్న మృణాల్ ఆరోపణలు!

Mrunal Thakur: నావి అలా లేవని అవమానించారు… సంచలనం రేపుతున్న మృణాల్ ఆరోపణలు!

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తెలుగులో స్టార్ గా ఎదుగుతున్నారు. సీతారామం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ భారీ విజయం అందుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామంలో సీతగా అద్భుత నటన, అందంతో మెప్పించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆ మూవీ ప్రేక్షకుల మనసులు దోచేసింది. సీతారామం తర్వాత మృణాల్ కి తెలుగులో ఆఫర్స్ పెరిగాయి. నానికి జంటగా నటించిన హాయ్ నాన్న సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.

ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా హాయ్ నాన్న తెరకెక్కింది. మరో చక్కని పాత్ర హాయ్ నాన్న చిత్రంలో చేసింది మృణాల్. నెక్స్ట్ ఆమె విజయ్ దేవరకొండ సరసన కనిపించనుంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో మృణాల్ హీరోయిన్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాత కాగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. సీరియల్స్ చేస్తూనే ఆమె సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నం చేశారు. లవ్ సోనియా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం హృతిక్ కి జంటగా సూపర్ 30 చిత్రంలో నటించింది. అయితే కెరీర్ బిగినింగ్ లో మృణాల్ అనేక అవమానాలు ఎదుర్కొన్నారట. తనపై కొందరు బాడీ షేమింగ్ పాల్పడ్డారని మృణాల్ చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు నేను ఇబ్బందిపడ్డాను. మరొకరితో పోల్చుతూ అవమానించారు.

ఒక సాంగ్ కోసం బరువు తగ్గాలని అన్నారు. నేను తగ్గను అని గట్టిగా చెప్పాను. ఓ ఈవెంట్ లో ఫోటోగ్రాఫర్ నన్ను అవమానించాడు. నువ్వు సెక్సీగా లేవు అన్నాడు. ఎవరీ పల్లెటూరి అమ్మాయి అని చులకనగా మాట్లాడాడు… అని మృణాల్ ఆరోపణలు చేశారు. గతంలో కూడా మృణాల్ బాలీవుడ్ మీద అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ మూవీలో ఆఫర్ ఇచ్చి తర్వాత తప్పించారని. సీరియల్ నటి అనగానే చులకనగా చూసేవారని ఆమె ఆవేదన చెందారు. మట్కా(కుండ)అని ఎగతాళి చేసేవారట.

Exit mobile version