DK Aruna
DK Aruna: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే.అరుణ(DK. Aruna) ఇంట్లో ఆదివారం రాత్రి ఓ అగంతకుడు చొరబడ్డాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jublee Hills)లో ఉన్న ఇంట్లో చొరబడిన అగంతకుడు గంటన్నరపాటు తిరిగాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో డీకే.అరుణ ఇల్లు ఉంటుంది. ఇది మరింత సంచలనంగా మారింది. అంగంతకుడు ఇంట్లో నుంచి ఏమీ ఎత్తుకెళ్లలేదు. దీంతో అంగతంకుడు ఎందుకు వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీకే. అరుణ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోని అత్యంత భద్రతా ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, ఈ చొరబాటు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. చొరబాటుదారుడు లోపల ఒక గంటకు పైగా ఏమీ దొంగిలించకుండా గడిపాడు, దీని వలన వారి ఉద్దేశం ఏమిటన్న అనమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు డీకే.అరుణ పోలీసలకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీని భద్రత పెంచాలని కోరాను.
Also Read: పీఎం ఇంటర్న్‌షిప్‌కు మొబైల్ యాప్..నిరుద్యోగులకు నెలకు 6వేలు
ముసుగు ధరించి 90 నిమిషాలు..
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఒక ముసుగు ధరించిన వ్యక్తి 90 నిమిషాలకు పైగా లోపల గడిపి, ఏమీ దొంగిలించలేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissonar) సీవీ.ఆనంద్ మరియు వెస్ట్ జోన్ డీసీపీ ఆ ఘటనను పరిశీలించారు. తక్షణ చర్యల కోసం, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, చొరబాటుదారుడి కదలికలను గుర్తించడం ప్రారంభించారు. ఈ ఘటన సాధారణ దొంగతనం కాకపోవచ్చనే అనుమానం ఉన్నందున, ఇంటెలిజెన్స్(Intelligence) విభాగం దీన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
నిందితుడి అరెస్ట్..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జూబ్లీ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ మరియు జూబ్లీ హిల్స్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. గతంలో ఈ నిందితుడు ఢిల్లీ, హైదరాబాద్ పాతబస్తీల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని పాతబస్తీ(Pata Basthee) పరిసరాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలో భద్రతా లోపాలపై చర్చను రేకెత్తించింది.
ఆదివారం ఉదయం బిజెపి ఎంపి డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రెండు గంటలు హల్చల్ చేశారు. మహబూబ్ నగర్ లో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. జూబ్లీ హిల్స్ స్టేషన్ లో ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. pic.twitter.com/AIZD4KEsMF
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 17, 2025