Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలను మాత్రమే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలతో వాళ్లు సినిమాలు చేయాలని నిశ్చయించుకున్నప్పటికి అది అనుకుని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. దానివల్ల కొంతమంది దర్శకులు సైతం కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉంటాయి…మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న దర్శకులు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా నేపధ్యంలో దర్శకుడు సైతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నారు…
Also Read : మహేష్ బాబు కోసం 4 కథలు రాసుకున్నప్పటికి ఒక్క సినిమా కూడా చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్…
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో వర్క్ చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటాడు. కారణం ఏంటి అంటే ఒక మంచి కథకి స్టార్ హీరో దొరికితే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. అందువల్లే ప్రతి డైరెక్టర్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి… ఇక మహేష్ బాబుతో ఒక స్టార్ డైరెక్టర్ వరుసగా సినిమాలు చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ మహేష్ బాబు వాటికి పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన మహేష్ బాబు (Mahesh Babu) తో సినిమా చేయాలనే తన కోరికను కూడా చంపేసుకున్నాడనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్(Shankar)…
మొదట శంకర్ మహేష్ బాబుతో త్రీ ఇడియట్స్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు రీమేక్ సినిమాలు చేయడు. కాబట్టి ఆ సినిమాను నేను చేయనని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత మరో రెండు కొత్త సబ్జెక్టులతో మహేష్ బాబు దగ్గరికి వచ్చినప్పటికి ఆయన శంకర్ తో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో ఆయన మహేష్ బాబును లైట్ తీసుకున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి దర్శకుడు ఒకప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆయనకు వరుసగా ప్లాప్ లు రావడంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది. అయితే మహేష్ బాబు తనతో సినిమా చేయడని నిశ్చయించుకున్న శంకర్ మరోసారి తనను అప్రోచ్ అయితే అవ్వలేదట.
శంకర్ కి గత పది సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన మార్కెట్ డౌన్ అయిపోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది. దాంతో శంకర్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎవరు ఆసక్తి చూపించడం లేదు…
Also Read : మహేష్ బాబు తో పోటీ పడి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న హీరోలు వీళ్లేనా..?