https://oktelugu.com/

Greater Visakhapatnam : కూటమి ఖాతాలోకి గ్రేటర్ విశాఖ.. అవిశ్వాస తీర్మానం రెడీ!

Greater Visakhapatnam : అవిశ్వాస తీర్మానాలు పెట్టి నగరాలు, పట్టణాలను తన ఖాతాలో వేసుకోవాలని కూటమి భావిస్తోంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గడువు సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది కూటమి.

Written By: , Updated On : March 18, 2025 / 12:29 PM IST
Greater Visakhapatnam

Greater Visakhapatnam

Follow us on

Greater Visakhapatnam : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలపై పట్టు సాధించాలని భావిస్తోంది. స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉంటాయి. ఆపై మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు సైతం కొనసాగుతూ ఉంటాయి. కానీ స్థానిక సంస్థల్లో ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దానిని చేజిక్కించుకునే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి నగరాలు, పట్టణాలను తన ఖాతాలో వేసుకోవాలని కూటమి భావిస్తోంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గడువు సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది కూటమి.

Also Read : శాసనమండలిలో వైసిపి క్లోజ్.. అవిశ్వాస తీర్మానం!

* అవిశ్వాస తీర్మానాలకు ముగిసిన గడువు
నాలుగేళ్ల కిందట వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అన్ని మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలను కైవసం చేసుకుంది. అయితే ఎన్నికల సమయంలోనే నాలుగేళ్లపాటు అవిశ్వాస తీర్మానం లేకుండా చట్టం చేసింది. అయితే నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి సంబంధించి మార్చి 18 గడువు ముగిసింది. దీంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టుకోవచ్చు. మున్సిపల్ చైర్మన్ ల తో పాటు మేయర్లను కుర్చీ నుంచి దించవచ్చు. అయితే తాజాగా విశాఖ మహానగరం పై దృష్టి పెట్టింది కూటమి. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

* వైసిపి ఏకపక్ష విజయం
98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖపట్నం( greater Visakhapatnam) మున్సిపల్ ఎన్నికల్లో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 58 డివిజన్లో గెలిచి సత్తా చాటింది. కూటమి కేవలం 32 స్థానాలకు పరిమితం అయింది. అప్పట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి కుమారి మేయర్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆమె ఐదేళ్లపాటు మేయర్ గా కొనసాగుతారని అంతా భావించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పదవి నుంచి దించేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

* బలం తారుమారు
ఎన్నికలకు ముందు చాలా మంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో( Alliance parties) చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సైతం చాలామంది టిడిపి తో పాటు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు కూటమి బలం పెరిగింది. మరోవైపు మార్చి 18 తో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి గడువు ముగిసింది. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ కూటమి ఖాతాలో పడినట్టే.

Also Read : ఆ సమయంలోనే జగన్ టార్చర్.. సంచలన అంశాలను బయటపెట్టిన బాలినేని!