https://oktelugu.com/

High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌..

తెలంగాణలో ఎమ్మెల్యే అనర్హత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. ఇప్పటికే సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లారు. కీలక తీర్పు వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2024 / 01:20 PM IST
    Follow us on

    High Court: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ, గడిచిన ఏడాది కాంలోనే బీఆర్‌ఎస్‌ అధికార పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది. కొత్త ప్రభుత్వాన్ని కుదురుకోనివ్వడం లేదు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో బీఆర్‌ఎస్‌లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. మొదట ఖైతరాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై ఎంపీగా పోటీ చేశారు. తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పార్టీ మారారు. తర్వాత కడియం శ్రీహరితోపాటు పలువురు హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

    కోర్టుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌…
    ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. స్పీకర్‌ త్వరగా నిర్ణయతం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ బెంచ్‌ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. లేదంటే తామే జోక్యం చేసుకుంటామని 10వ షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీఆర్‌స్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును స్వాగతించారు. న్యాయం గెలిచిందని ప్రకటించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఆందోళన మొదలైంది. ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కూడా జరిగింది.

    డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన అసెంబ్లీ కార్యదర్శి..
    బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు తీర్పును శుక్రవారం(నవంబర్‌ 22)కు రిజర్వు చేశారు. ఈమేరకు శుక్రవారం తీర్పు వెల్లడించారు. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

    స్పీకర్‌దే తుది నిర్ణయం..
    ఎమ్మెల్యేల అన ర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని పేర్కొంది. ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి అనేది స్పీకర్‌ విచక్షణాధికారం అని స్పష్టం చేసింది. దీనికి టైం అంటూ ఏమీ లేదని స్పష్టం చేసింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. ఈ తీర్పుతో ఉప ఎన్నికలు వస్తాయని ఆశపడిన బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది.