https://oktelugu.com/

Bandi Sanjay: ఆ 3 గంటలే ‘బండి’ని ఓడించి ‘గంగుల’ను గెలిపించాయా?

మూడుసార్లు గెలిచిన అహంకారం ఒకవైపు.. పదవి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం ఇంకోవైపు.. డబ్బులు పడేస్తే ఓటర్లు చచ్చుకుంటూ ఓటేస్తారన్న ఆలోచనతో అమాత్యుడి హోదాలో గంగుల కమలాకర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 10, 2023 / 12:19 PM IST

    Bandi Sanjay

    Follow us on

    Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటాల గడ్డ కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ వరుసగా నాలుగోసారి విజయం సాధించడంపై నగరం నివ్వెరపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత గంగులపై ఉన్నా ఫలితం మాత్రం గంగులకు అనుకూలంగా రావడంపై ప్రతీ ఒక్కరు ఏం జరిగి ఉంటుందని చర్చించుకుంటున్నారు. వరుసగా మూడుసార్లు గెలవడం, మంత్రి పదవి రావడంతో గంగుల కమలాకర్‌ తీరు పూర్తిగా మారిపోయింది. నేల విడిచి సాము చేయడం మొదలు పెట్టారు. కబ్జాదారులను ప్రోత్సమించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో అనుయాయులు భూములు పంచాడు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీలోనే అనేక అక్రమాలు జరిగాయి. ఇక ప్రజలు కలిసి తమ బాధ చెప్పుకునే అవకాశమే లేకుండా పోయింది. బీఆర్‌ఎస్‌ నేతల అకృత్యాలపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఫిర్యాదు చేసినవారిపైనే కక్షసాధింపులు.. ఇలా అన్నీ కలిసి గంగుల కమలాకర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.

    ఆధికార, ఆర్థిక బలాన్ని నమ్ముకుని..
    మూడుసార్లు గెలిచిన అహంకారం ఒకవైపు.. పదవి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం ఇంకోవైపు.. డబ్బులు పడేస్తే ఓటర్లు చచ్చుకుంటూ ఓటేస్తారన్న ఆలోచనతో అమాత్యుడి హోదాలో గంగుల కమలాకర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది. అధికార, ఆర్థిక బలం ముందు ఎవడూ తనను ఓడించలేడని అనుకున్నారు. చివరకు అదే జరిగింది.

    జర్నలిస్టులకు భూముల ఎర..
    ఎన్నికల వేళ తనకు అనుకూలంగా పత్రికల్లో కథనాలు రాయించుకునేందుకు జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుకు భూములు ఎరగా వేశాడు. చింతకుంట, మల్కాపూర్‌ శివారులోని ఎస్సారెస్పీ భూములను అక్రమంగా కేటాయించారు. ఎస్సారెస్పీ నుంచి ఎన్‌వోసీ లేకుండానే భూముల కేటాయింపు రహస్యంగా చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు రెండు రోజుల ముందు జర్నలిస్టుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రి పేషీలో పనిచేసే వర్కర్లు, మంత్రికి అనుకూలంగా ఉండే వారికి డబుల్‌ బెడ్రూం అలాట్‌మెంట్‌ లెటర్‌ కింద భూములు పంచారు. దీంతో నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. దీంతో అన్యాయం జరిగిన వారు ఎలాగైనా గంగుల ఓడిపోవాలని ప్రయత్నించారు.

    అమ్ముడు పోయిన ఆ వర్గం ఓటర్లు..
    నవంబర్‌ 30న పోలింగ్‌ రోజు ఓటర్లు గంగులకు వ్యతిరేకంగా ఓటెత్తారు. కరీంగనర్‌లోని 34 డివిజన్ల ఓటర్లు గంగులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అధికార పార్టీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలోనూ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ కేవలం 40 శాతమే నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గంగుల వ్యతిరేకులు, హిందువులు ఒక్కటయ్యారు. పోలింగ్‌ ముగియడానికి మూడు గంగల ముందు ఈ విషయం గుర్తించిన గంగుల వర్గం.. ఆందోళన చెందింది. ఈవిషయాన్ని అమాత్యుడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన గంగుల కమలాకర్‌ ఆర్థిక బలం ప్రదర్శించారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే డివిజన్లలో డబ్బులు వెదజల్లాడు. ఓటుకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేయించారు. పోలీసులంతా ఎన్నికల విధుల్లో ఉండగా, గంగుల మాత్రం రహస్యంగా మైనారిటీలకు డబ్బులు పంచారు. ఇక మైనారిటీ మత పెద్దలకు ఫోన్లు చేసి.. మసీదుల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయిస్తూ చెక్కు రాసి ఇచ్చారు. గంగులకు అమ్ముడు పోయిన ఆ వర్గం చివరి మూడు గంటల్లో పోలింగ్‌ కేంద్రాలకు క్యూకట్టారు. దీంతో చివరి మూడు గంటల్లో ఫలితం తారమారైంది.

    మైనారిటీల ముందు ఓడిన మెజారిటీ ఓటర్లు..
    కరీంనగర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్ల కమిట్‌మెంట్‌ ముంద.. మెజారిటీ వర్గం ప్రజలు ఓడిపోయారు. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసిన హిందూ సమాజం.. ఓట్లు ముగ్గురు అభ్యర్థుల మధ్య చీలిపోగా.. అమ్ముడు పోయిన మైనారిటీ ఓట్లు గంపగుత్తాగా గంగలకే పడ్డాయి. దీంతో గంగుల గెలిచారు.. బండి ఓడారు.