Bigg Boss 7 Telugu: హౌస్ నుండి శోభ శెట్టి అవుట్… 14 వారాలకు అన్ని లక్షలా? రికార్డు బ్రేక్!

సీరియల్ బ్యాచ్ కి చెందిన శోభను కాపాడుకుంటూ వచ్చారు. ఆమె కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని కూడా ఎలిమినేట్ చేసి బలి చేశారనే టాక్ వినిపించింది. షో చివరి దశకు చేరుకోగా... ఇంకా కాపాడే అవకాశం లేదు.

Written By: NARESH, Updated On : December 10, 2023 12:12 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. నేడు శోభ శెట్టి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం హౌస్లో టాప్ 7 ఉన్నారు. వీరిలో అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఓటింగ్ లో వెనుకబడిన శోభ ఎలిమినేట్ అయ్యిందట. నిజానికి శోభ చాలా వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది.

అయితే ఆమెకు స్టార్ మా సపోర్ట్ చేశారనే వాదన ఉంది. సీరియల్ బ్యాచ్ కి చెందిన శోభను కాపాడుకుంటూ వచ్చారు. ఆమె కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని కూడా ఎలిమినేట్ చేసి బలి చేశారనే టాక్ వినిపించింది. షో చివరి దశకు చేరుకోగా… ఇంకా కాపాడే అవకాశం లేదు. అందరూ టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎట్టకేలకు శోభకు ఉద్వాసన పలికారు. శోభ ఎలిమినేట్ అయ్యారన్న న్యూస్… యాంటీ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7లో శోభ శెట్టి అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్ గా ఉంది. ఆమె ప్రవర్తన, ఆట తీరు, మాట తీరు మెజారిటీ ఆడియన్స్ కి నచ్చలేదు. శోభ మాటలు, ఎక్స్ప్రెషన్స్ రెచ్చగొట్టేవిగా ఉంటాయి. సీరియల్ బ్యాచ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తూ గ్రూప్ గేమ్ ఆడింది. అందుకే ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నా.. శోభ శెట్టికి తక్కువ ఓట్లు పడేవి. కానీ ఎలిమినేట్ అయ్యేది కాదు.

14వ వారం మాత్రం ఆమెకు గుడ్ బై చెప్పారు. ఎలిమినేట్ అయినప్పటికీ శోభ శెట్టి భారీ రెమ్యునరేషన్ ఆర్జించినట్లు సమాచారం. సీరియల్ నటి అయిన శోభ శెట్టి వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. 14 వారాలకు రూ. 31.5 లక్షలు తీసుకుందట. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లలో ఎవరూ ఇంత మొత్తం తీసుకోలేదు. శోభ శెట్టి రికార్డు నెలకొల్పింది. కార్తీకదీపం సీరియల్ లో విలన్ మోనిత పాత్రతో శోభ శెట్టి ఫేమస్ అయ్యింది.