Revanth Reddy Vs Allu Arjun
Allu Arjun : సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంఘటన పాన్ ఇండియా లెవెల్ లో పెను రామారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి, దీనికి కేవలం ఒకరినే నిందించడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం చేసిన పొరపాట్లు కారణంగా ఇప్పటి వరకు ఎవ్వరు చనిపోలేదా..?, ఎందుకు అల్లు అర్జున్ ని ఒక్కడినే చేసి టార్గెట్ చేస్తున్నారంటూ ఆయనకీ సపోర్టుగా ప్రతీ ఒక్కరు నిలిచారు. అయితే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసాడు. ఎంతటి తీవ్రమైన ఆరోపణలంటే, ఇది అబద్దం అయితే అల్లు అర్జున్ పరువు నష్టం దావా కేసు వేసేంత. అయితే అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ పై జనాల్లో ఏర్పడిన సానుభూతిని చెరిపివేయడానికే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అని సందేహిస్తున్నారు విశ్లేషకులు.
అల్లు అర్జున్ కి రేపో మాపో బెయిల్ రద్దు అవ్వొచ్చు, మళ్ళీ ఆయన అరెస్ట్ అయితే సానుభూతి ఇంకా పెరగొచ్చు. అది జరగకూడదు అనే ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేసారా అనే కోణం లో వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాసేపు పక్కన పెడితే, అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ పై చేసిన ఆరోపణలు ఇంకా దారుణంగా ఉన్నాయి. పోలీసులు ఒక మహిళ తొక్కిసిలాట లో చనిపోయింది అని అల్లు అర్జున్ కి చెప్తే, దానికి ఆయన ‘అవునా..అయితే నా సినిమా సూపర్ హిట్’ అని మాట్లాడాడు అని ఓవైసీ వ్యాఖ్యానించాడు. ఇది దారుణమైన ఆరోపణ. అల్లు అర్జున్ ని ద్వేషించేవాళ్ళు కూడా ఈ మాటలను నమ్మరు.ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ తప్పు చేసాడని జనాల్లో ఒక అభిప్రాయాన్ని బాగా రుద్ది, చివరికి అతను అరెస్ట్ అయినా సానుభూతి కలుగకూడదు అనే ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు.
అయితే మరికాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముందుకు రాబోతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఆరోపణలకు ఆయన ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఒకవేళ అల్లు అర్జున్ ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీ రిస్క్ లో పడనుందా?, ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఒక మనిషి చావుకి కారణం అయ్యిందని, అలాంటి ఇండస్ట్రీ కి నేను సీఎం గా ఉన్నంత కాలం టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వబోనని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా మాట్లాడితే సమస్య ఇంకా పెద్దది కానుందా?, ఇండస్ట్రీ మరింత రిస్క్ లోకి వెళ్లనుందా అనేది చూడాలి. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కోసం ఆయన అభిమానులతో పాటు రాజకీయ నాయకులూ కూడా ఎదురు చూస్తున్నారు.