https://oktelugu.com/

Chiranjeevi : తెలంగాణ లో టికెట్ రేట్స్ కోసం చిరంజీవి రంగంలో దిగాల్సిందేనా..? ‘గేమ్ చేంజర్’ పరిస్థితి ఏమిటి?

తెలంగాణాలో అలాంటి సమస్యే రావడంతో, మళ్ళీ చిరంజీవి రంగం లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియా లో మెగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం విడుదల కానుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 07:40 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన ని దృష్టిలో పెట్టుకొని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనం నిర్ణయం తీసుకుంటూ ఇక మీదట తెలంగాణ లో బెనిఫిట్ షోస్ కి కానీ, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కానీ అనుమతి ని ఇవ్వను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇంతే అని చెప్పుకొచ్చాడు. దీనిపై ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సమయంలో సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ కి పెద్ద నష్టమే. గతం లో జగన్ ప్రభుత్వం లో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి వంటి వారు సీఎం జగన్ ని కలిసి అతన్ని రిక్వెస్ట్ చేసి కొత్త జీవో పాస్ అయ్యేలా చేసుకున్నారు.

    ఇప్పుడు మరోసారి తెలంగాణాలో అలాంటి సమస్యే రావడంతో, మళ్ళీ చిరంజీవి రంగం లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియా లో మెగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కానుంది. సుమారుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ చిత్రానికి కచ్చితంగా టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కావాలి. సీఎం రేవంత్ రెడ్డి మొండిపట్టు పడితే గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు కి భారీ నష్టం రాక తప్పదు. ఇప్పుడు దిల్ రాజు ఎలాగో తెలంగాణ ప్రభుత్వం తరుపున ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఆయనతో కలిసి చిరంజీవి అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లోని ప్రముఖ నిర్మాతలు, సినీ హీరోలు కూడా వచ్చి సీఎం తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం తో పాటు, వచ్చే ఏడాది అనేక పాన్ ఇండియన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రమే. అదే విధంగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మళ్ళీ అదే ఏడాది పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘ఓజీ’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి కూడా కచ్చితంగా టికెట్ రేట్స్, హైక్స్ కావాల్సిందే. టాలీవుడ్ స్థాయి ని మరో లెవల్ కి తీసుకెళ్లే సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. తెలంగాణ మార్కెట్ మన సినీ పరిశ్రమకి చాలా కీలకం, రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 చిత్రం ఇక్కడ 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. భవిష్యత్తులో రాబోయే సినిమాలన్నీ ఇదే రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి.