Game Changer Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపైతే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఆయన సాధించిన విజయాలే కాకుండా తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్, తన కొడుకు అయినా రామ్ చరణ్ లు కూడా భారీ విజయాలను సాధించే విధంగా వాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమాను జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్ ప్రణాళికల రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ యావత్ తెలుగు సినిమా అభిమానులందరూ కోరుకుంటున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఎలాగైనా సరే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ అయితే రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి శంకర్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక ఈ ఇయర్ వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.
కాబట్టి ఈ సినిమా అయినా సరే సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి శంకర్ ను టాప్ డైరెక్టర్ గా నిలబెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని మొదట పవన్ కళ్యాణ్ కి చూపించాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా పాలిటిక్స్ తో ముడిపడిన ఒక పొలిటికల్ డ్రామా గా తెరకెక్కింది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం పొలిటిషన్ గా ముందుకు సాగుతున్నాడు. కాబట్టి అతని డిసిజన్ తెలుసుకోవడానికి అతనికి ముందుగా ఈ సినిమాని వేసి చూపించాలని అటు ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఇటు డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది…
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా రామ్ చరణ్ క్రేజ్ అనేది భారీగా పెరుగుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…