Dharma Mahesh Vs TV5 Murthy: ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ వార్తలను మాత్రమే ప్రసారం చేసేవి. ఆ తర్వాత గాసిప్స్ ను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏకంగా తీర్పులు ఇచ్చేస్తున్నాయి. న్యాయస్థానాల బాధ్యతలను న్యూస్ చానల్స్ తీసుకుంటున్నాయి. కుటుంబాల మధ్య.. వ్యక్తుల మధ్య జరుగుతున్న పంచాయితీలను రాష్ట్ర సమస్యలుగా, అంతర్జాతీయ ఇబ్బందులుగా పేర్కొంటూ డిబేట్ల మీద డిబేట్లు నిర్వహిస్తున్నాయి.
ఇలాంటి పోకడ సరికాదని.. ఇలాంటి విధానాలను ఎవరూ ఆమోదించరని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రేక్షకులు అవే చూస్తున్నారు.. కాబట్టి మేము కూడా అలాంటి వాటిని ప్రసారం చేయాల్సి వస్తోందని ముక్తాయింపు ఇస్తున్నారు. సహజంగానే గొడవంటే ఎవరికైనా ఒక ఆసక్తి ఉంటుంది. వివాదం అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే వాటి గురించి లోతుల్లోకి వెళ్లడం.. కాస్త తెలియని సమాచారం తెలుసుకోవడం.. ఎవరికైనా ఆసక్తే. అలాగని అస్తమానం అవే విషయాలను ప్రసారం చేసి.. ప్రచారం చేసి బలవంతంగా రుద్దితే జనాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వీడియోని ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ధర్మ మహేష్ అనే వ్యక్తికి అతని భార్యకి కొద్దిరోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ధర్మ మహేష్ వైపు కొన్ని మీడియా సంస్థలు.. అతని భార్య వైపు కొన్ని మీడియా సంస్థలు చేరిపోయాయి. ఆయా మీడియా సంస్థలకు వెళ్లి ధర్మ మహేష్, ఆమె భార్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను, సంసారాలలో చోటుచేసుకున్న పరిణామాలను పంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ధర్మ మహేష్ టీవీ 5 లో పనిచేస్తున్న మూర్తి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అనవసరంగా తమ వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారని.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు..
తన భార్య వెనుక మూర్తి ఉన్నారని.. ఆమె ఉన్న ఫ్లాట్ కు వెళ్తున్నారని.. తమ సంసార జీవితంలోకి మూర్తి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మీడియా లో పనిచేస్తున్న వ్యక్తికి దంపతుల మధ్య గొడవను పరిష్కరించాల్సిన అవసరం ఏమిటని మండిపడుతున్నారు. ధర్మ మహేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి దీనికి.. ఒక భర్త.. ఒక భార్య.. ఒక ప్లాటు.. ఒక మీడియా లో పనిచేసే వ్యక్తి అని శీర్షిక పెట్టి.. ఎంత పెంట చేయాలో అంత పెంట చేస్తున్నాయి. ఈ వ్యవహారం ఎటు వెళుతుందో తెలియదు కానీ.. మొత్తానికైతే సోషల్ మీడియాలో పడి పెంట పెంట అవుతోంది. ఒకప్పుడు మీడియా అంటే విశ్వసనీయతకు మారుపేరుగా ఉండేది. ఇప్పుడైతే బి గ్రేడ్ స్థాయి కి మించి దిగజారిపోయింది.
ఒక భర్త,, ఒక భార్య,,ఒక ఫ్లాటు,, ఒక ప్లేటు
మధ్యలో TV5 మూర్తి…. సంసారం మటాష్, బతుకులు బజారుకి pic.twitter.com/CbbjL8Bnkx— Anitha Reddy (@Anithareddyatp) September 27, 2025