Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది… ఒక హీరో మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే, మరొక హీరో రొమాంటిక్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇక ఇంకొక హీరో చారిత్రాత్మక సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు…ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…కెరియర్ మొదట్లో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి డిఫరెంట్ సినిమాలను చేశాడు. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో జానీ సినిమా చేశాడు… పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఏ సినిమాకు లేని హైప్ జానీ సినిమాకి క్రియేట్ అయింది. దాంతో సినిమా అనుకున్న రేంజ్ లో లేదని ఫ్యాన్స్ సైతం డిసప్పాయింట్ అయ్యారు… ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి వరుసగా ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు…ఇక అత్తారింటికి దారేది తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్ అయితే ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ ప్రొడ్యూసర్ యొక్క వైఖరి నచ్చకపోవడంతో నీతో సినిమా చేయనని చెప్పేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో సినిమా అంటే 24 క్రాఫ్టులకు చెందిన కళాకారులను ఒక్కటి చేసేది. దాన్ని బిజినెస్ యాంగిల్ లో చూడడం అతనికి నచ్చలేదు.
అందువల్లే ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికి, ఆ తర్వాత అతనితో ఒక్క సినిమా కూడా చేయలేదు.డబ్బుందనే గర్వం ఆ ప్రొడ్యూసర్ కి ఎక్కువగా ఉంది..అందుకే బ్లాంక్ చెక్ ఇచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర చెప్పాడట…’పవర్ హౌజ్ ను ముట్టుకునే ముందే ఆలోచించాలి పొరపాటున ఒకసారి తగిలిన ఆ పవర్ ను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు’ అని చెప్పడానికి ఈ సంఘటనను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు…
పవన్ కళ్యాణ్ విషయం లో ఆ ప్రొడ్యూసర్ అలాంటి తప్పే చేశాడు…పవన్ కళ్యాణ్ కళాకారులందరిని చాలా గౌరవిస్తాడు. ఎందుకంటే తను ఏ పొజిషన్లో ఉన్న కూడా వాళ్లకు ఉన్న కళ చాలా గొప్పది. వాళ్ళు ప్రేక్షకులందరిని రంజింప చేస్తూ ఉంటారు వారిని గౌరవించకపోతే మాత్రం ఆయన ఎవరినైనా సరే ఎదిరిస్తాడు…
అందుకే పవన్ కళ్యాణ్ హీరోగా కంటే కూడా తనను వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీ గా ఉంటాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు. సినిమా అనేది కొన్ని వందల మందికి ఉపాధిని కల్పిస్తోంది. కాబట్టి అతని దృష్టిలో సినిమా అనేది చాలా గొప్పదని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
అలాంటి సినిమాతో బిజినెస్ చేసుకోవాలి. కానీ బిజినెస్ కోసమే సినిమా చేస్తున్నాం అనే వాళ్లను చూస్తే ఆయనకు మా చెడ్డ చిరాకు అంటూ తన సన్నిహిత వర్గాల నుంచి కూడా అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించిన ఆయన లాంగ్ రన్ లో ఈ సినిమాతో పాన్ ఇండియా లో ఉన్న పలు రికార్డులను తిరగరాస్తాడని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు…